జనసేన యువశక్తి సభ: వచ్చే ఏపీ ఎన్నికల్లో పొత్తులపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Janasena Yuva Shakti Meeting: Pawan Kalyan Interesting Comments over Alliances in Next AP Assembly Elections,Mango News,Mango News Telugu,Janasena Yuva Shakti Meeting,Janasena Yuva Shakti Meeting Latest News,Janasena Yuva Shakti Meeting Live Updates,Janasena Yuva Shakti Meeting News,Pawan Kalyan Interesting Comments over Alliances in Next AP Assembly Elections,Pawan Kalyan Latest News,Pawan Kalyan Speech At Janasena Yuva Shakti Meeting,AP Assembly Elections

శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా గురువారం జనసేన పార్టీలో ఆధ్వర్యంలో జరిగిన యువశక్తి సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వివేకానంద వికాస వేదిక నుంచి సభకు లక్షలాదిగా హాజరైన యువతను ఉద్దేశించి సుధీర్ఘ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వచ్చే ఏపీ ఎన్నికల్లో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే ఓకే, లేదంటే ఒంటిరిగానే వెళతామని అన్నారు. అలాగే ఎన్నికలకు ఒంటరిగా వెళ్లి వీర మరణాలు పొందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

“వచ్చే ఎన్నికలకు ఓటు చీలకూడదు. అలా అని నేను సీట్ల గురించి మాట్లాడలేదు. మాట్లాడను కూడా. వ్యూహం ఉండాలి. ఒంటిరిగా వెళ్లి వీర మరణాలు అవసరం లేదు. ఒంటరిగా వెళ్తే గెలిపిస్తామని గ్యారెంటీ ఇస్తారా?, మీరంతా నా కుటుంబం అనుకున్నాను. నా కుటుంబమే నిలబడకపోతే నేను మాత్రం ఏం చేయను. నేను చాలా పకడ్బందీగా ఆలోచించే చెబుతున్నా. ఒంటరిగా వెళ్లడానికి ఇబ్బంది లేదు. భయపడే వ్యక్తిని కాదు. రాజకీయం నాకు బాధ్యత. కొన్ని కులాలను వర్గశత్రువులుగా ప్రకటించి, మతాల మధ్య చిచ్చు పెడితే కుదరదు. దేవాలయాల్ని అపవిత్రం చేసిన వారిని శిక్షించకుండా వదిలేయడం కుదరదు. ఒంటిరిగా వెళ్లే స్థాయిలో మీరు నాకు నమ్మకం కలిగిస్తే నేను అప్పుడు నిలబడతా. అందర్నీ హింసించే వాడిని ఎదుర్కోవాలి. అలా అని గౌరవం తగ్గకుండా లొంగిపోకుండా కుదిరితే చేస్తాం. లేదా ఒంటరిగానే వెళ్తాం. ఎక్కడా తగ్గం. నేను ధామాషా పద్ధతి అని చెప్పాను. రాజకీయం అంతా మూడు కులాల చుట్టూతే తిరగడమేంటి?, రెడ్డి, కమ్మ, కాపు అంటారేంటి? మిగిలిన కులాలు లేవా?, ఇది మారాలని నేను కోరుకుంటున్నా. రూలింగ్ కాస్ట్ కాన్సెప్ట్ కి నేను వ్యతిరేకం. మనమంతా సమానం అన్ని కులాలు సమానం. కొన్ని కులాలు సమానత్వానికి పెద్దన్న పాత్ర పోషిస్తానంటే మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =