ఆ రాష్ట్రంలో మళ్ళీ కరోనా ఆంక్షలు, డిసెంబర్ 1 నుంచి 15 వరకు నైట్ కర్ఫ్యూ

Mango News Teugu, Night Curfew in Punjab, Night curfew to be imposed in Punjab, Punjab, Punjab Curfew, punjab curfew extended News, punjab curfew News, punjab government, Punjab Govt, Punjab Govt Decides to Impose Night Curfew, Punjab Govt Decides to Impose Night Curfew in All Cities, Punjab imposes night curfew, Punjab Lockdown, Punjab Night Curfew News

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుదల, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు మరోసారి ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి పంజాబ్ కూడా చేరింది. డిసెంబర్ 1 వ తేదీ నుండి పంజాబ్ లోని నగరాలు మరియు పట్టణాల్లో రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించినట్టు పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్‌ వెల్లడించారు. రాత్రి కర్ఫ్యూ డిసెంబర్ 15 వరకు కొనసాగుతుందని, అనంతరం పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు వివాహ వేదికలు/ఫంక్షన్ హాల్స్ రాత్రి 9.30 గంటలకు మూసివేసేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం సహా కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానాను విధించనున్నట్టు తెలిపారు. మరోవైపు పంజాబ్ లో నవంబర్ 24, మంగళవారం నాటికీ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,665 కి చేరింది. 1,36,178 మంది కోలుకోగా, ప్రస్తుతం 6,834 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా వలన పంజాబ్ లో ఇప్పటికి 4,653 మంది మరణించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =