చైనాలో కరోనా కలకలం.. పలు నగరాలలో కఠిన లాక్‌డౌన్

China Covid Crisis Nearly 30 Million Under Lockdown in 13 Cities, Nearly 30 Million People Under Lockdown in 13 Cities, Lockdown in 13 Cities, China Covid Crisis, Covid Crisis In China, Covid Crisis, China's Biggest Covid Surge in 2 Years Imposes Lockdown in Several Cities, China's Biggest Covid Surge in 2 Years, China Imposes Lockdown in Several Cities, Biggest Covid Surge in 2 Years, Biggest Covid Surge, Covid Surge In China, Lockdown in Several Cities, Lockdown, Lockdown In China, Coronavirus, coronavirus China, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, Mango News, Mango News Telugu,

చైనాలో కరోనా కేసులు మళ్ళీ తీవ్ర స్థాయిలో రికార్డు అవుతున్నాయి. అక్కడ కరోనా వైరస్‌ విజృంభణ రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. చైనాలో సోమవారం 1,807 కేసులు నమోదు కాగా, గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 5,280 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. హాంకాంగ్‌లోనూ వైరస్‌ విజృంభిస్తున్నది. మరణాలు ఎక్కువగా నమోదవుతుండటం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. చైనాలోని జనసాంద్రత అధికంగా ఉండే జిలిన్ సిటీలో క‌రోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ‌ ప్రత్యేక హాస్పిట‌ల్ నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది.

కేవ‌లం 6 రోజుల్లోనే 6000 బెడ్స్‌తో ఈ హాస్పిట‌ల్‌ను నిర్మించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం అయింది. మంగళవారం చైనా అంతటా దాదాపు 30 మిలియన్ల మంది ప్రజలు లాక్‌డౌన్‌లో ఉన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించటం వల్లనే చైనాలో అనూహ్యంగా కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ ‘స్టెల్త్ ఒమిక్రాన్’ ఇక్కడ అధిక ప్రభావాన్ని చూపిస్తోందని తెలిసింది. మంగళవారం దేశవ్యాప్తంగా 13 నగరాలలో పూర్తిగా లాక్‌డౌన్‌ విధించబడింది. అనేక ఇతర నగరాలు పాక్షిక లాక్‌డౌన్‌లో ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 7 =