బ్రిటన్‌ను అధిగమించి అంతర్జాతీయ ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిన భారత్

India Overtakes UK To Emerge as World's Fifth Biggest Economy Bloomberg Reports, Bloomberg Reports Says India Overtakes UK To Emerge as World's Fifth Biggest Economy, India Overtakes UK To Emerge as World's Fifth Biggest Economy, World's Fifth Biggest Economy, India Overtakes UK, India has become the world's fifth-largest economy, India Surpasses UK, fifth-largest economy, Bloomberg Reports, world's fifth-largest economy News, world's fifth-largest economy Latest News And Updates, world's fifth-largest economy Live Updates, Mango News, Mango News Telugu,

భారతదేశం అంతర్జాతీయంగా మరో అరుదైన గుర్తింపు సాధించింది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ క్రమంలో ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటిష్ దేశమైన బ్రిటన్‌ను కూడా దాటేసింది. ఈ క్రమంలో అమెరికా, చైనా, జపాన్ మరియు జర్మనీల వెనుక భారత్ నిలిచింది. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. కాగా బ్లూమ్‌బెర్గ్ అనేది అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ప్రైవేట్‌గా నిర్వహించబడుతున్న సంస్థ. ఇది ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్, డేటా కలిగిఉన్న ప్రముఖ మీడియా సంస్థ.

బ్లూమ్‌బెర్గ్ అధ్యయనం ప్రకారం.. 2021 చివరి మూడు నెలల్లో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం యూకేని అధిగమించింది. ఈ గణన అమెరికా డాలర్లపై ఆధారపడి ఉంటుంది మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి జీడీపీ గణాంకాల ప్రకారం భారతదేశం మొదటి త్రైమాసికంలో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. బ్లూమ్‌బెర్గ్ తాజా లెక్కల ప్రకారం, 2022 మార్చి చివరిలో యునైటెడ్ కింగ్‌డమ్‌ను అధిగమించిన తర్వాత భారతదేశం ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇక ఈ సంవత్సరం భారత కరెన్సీకి వ్యతిరేకంగా పౌండ్ 8% పడిపోవడం ఇండియాకు కలిసొచ్చింది. ఒక దశాబ్దం క్రితం, భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానంలో ఉండగా, బ్రిటన్ 5వ స్థానంలో ఉంది. కానీ ప్రస్తుతం భారత్ 6 స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో స్థానంలో నిలవడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + thirteen =