వాట్సాప్ అప్‌డేట్: ఫిబ్రవరి 8 న ఖాతాల తొలగింపు ఉండదు, 3 నెలల తర్వాతే అమలు

Mango News, WhatsApp Delays its New Privacy Policy, WhatsApp Delays its New Privacy Policy by Three Months, whatsapp new policy 2021, WhatsApp New Privacy Policy, whatsapp new privacy policy 2021, WhatsApp New Privacy Policy Latest News, WhatsApp New Privacy Policy News, WhatsApp New Privacy Policy Updates, whatsapp privacy policy update, WhatsApp’s new ToS and Privacy Policy

గత కొన్ని రోజులుగా వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందుగా కొత్త ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే వారి‌ ఫోన్లలో ఫిబ్రవరి 8, 2021 నుంచి వాట్సాప్‌ పని చేయదని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఈ ప్రైవసీ పాలసీలోని నిబంధనలు వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి భంగం కలిగించేలా ఉన్నాయంటూ వార్తలు రావడంతో పలువురు వినియోగదారులు వాట్సాప్ నుంచి సిగ్నల్ మరియు టెలిగ్రామ్ యాప్స్ కు మారారు. సోషల్ మీడియాలో కూడా ఈ పాలసీపై పెద్దఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రైవసీ పాలసీపై వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 8 న ఏవరి ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా తొలగించడం చేయట్లేదని పేర్కొంది. మూడు నెలల తర్వాతే ఈ ప్రైవసీ పాలసీని అమలు చేస్తామని వాట్సాప్ వెల్లడించింది. మే 15 న కొత్త బిజినెస్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చేముందే, ఈ పాలసీపై సమీక్షించడానికి క్రమంగా ప్రజల వద్దకు వెళ్తామని వాట్సాప్ ప్రకటించింది.

“ఇటీవల కొత్త పాలసీ అప్‌డేట్ పై గందరగోళం నెలకుందని చాలా మంది నుండి విన్నాము. చాలా తప్పుడు సమాచారం ప్రచారం కావడం ఆందోళన కలిగిస్తుంది. మా సూత్రాలు మరియు వాస్తవాలను అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకురావడానికి వాట్సాప్ సహాయపడింది. ఈ భద్రతా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు మరియు భవిష్యత్తులో రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాం” అని వాట్సాప్ సంస్థ తెలిపింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =