విడాకులు తీసుకున్న కూతురును.. ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చిన తండ్రి

When daughter was tortured in her in-laws house father brought her back home with band baaja baaraa,When daughter was tortured,father brought her back home with band baaja baaraa,tortured in her in-laws house,Mango News,Mango News Telugu,band baaja baaraa, jharkand, father, daughter, divorce,father brought her back Latest News,father brought her back Latest Updates,father brought her back Live News
band baaja baaraa, jharkand, father, daughter, divorce

ఇంట్లో ఆడపిళ్ల ఉందంటే.. ఎప్పుడు పెళ్లి చేద్దామా అని పెద్దలు చూస్తుంటారు. త్వరగా బరువు, బాధ్యతలు తీర్చుకోవాలని ఆరాటపడుతుంటారు. పెళ్లి అయ్యాక అత్తారింట్లో కూతురు ఎలా ఉందో.. ఎన్ని కష్టాలు పడుతుందోనని కంగారు పడుతుంటారు. కొన్నికొన్నిసార్లు అత్తారింట్లో ఇబ్బందులు తలెత్తినా సర్దుకుపోవాలని తల్లిదండ్రులు చెబుతుంటారు. అయితే ఓ తండ్రి మాత్రం అత్తారింట్లో కూతురు కష్టాలను చూడలేక పుట్టింటికి తీసుకెళ్లాడు అది కూడా మేళతాళాలతో ఊరేగింపుకుగా తన ఇంటికి తీసుకెళ్లాడు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది ఈ ఘటన.

ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి కొన్నేళ్లుగా రాంచీలో తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. ఆయననకు సాక్షి గుప్తా అనే ఒక కూతురు ఉంది. చదువు పూర్తి కావడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో సచిన్ కుమార్ అనే వ్యక్తికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేశారు. అయితే అప్పటికే సచిన్‌కు పెళ్లి అయింది. అయినప్పటికీ తన కూతురును అతనికి కట్టబెట్టారు. కొద్దిరోజుల పాటు వారి పురంకా సజావుగానే సాగింది. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. సచిన్.. అతని తల్లిదండ్రులు సాక్షిని వేధించడం మొదలు పెట్టారు.

రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో.. విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్లిపోవాలని సాక్షి నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని సాక్షి తన తండ్రి ప్రేమ్ గుప్తాకి చెప్పింది. అయితే అందరు తండ్రులలా ప్రేమ్ గుప్తా తన కూతురుకు సర్ది చెప్పలేదు. ఆమె నిర్ణయాన్ని స్వాగతించాడు. తన కూతురు సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదని అనుకున్నాడు. అటు సాక్షి గుప్తా కూడా విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈనెల 15న ప్రేమ్ గుప్తా.. తన కూతురు సాక్షి గుప్తాను పుట్టింటికి తీసుకెళ్లాడు. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. మేళతాళాలతో.. టపాసులు కాలుస్తూ ఊరేగింపుగా తన కూతురును ఇంటికి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా ప్రేమ్ గుప్తానే సోషల్ మీడియాలో షేర్ చేశారు. కూమార్తెలు ఎంతో విలువైనవారని.. అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే గౌరవంతో పుట్టింటికి తీసుకురావాలని ప్రేమ్ గుప్తా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రేమ్ గుప్తా తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =