నేడే రాజ్‌కోట్‌లో శ్రీలంకతో భారత్ చివరి టీ20 మ్యాచ్, సిరీస్ కైవసం చేసుకునేదెవరో?

India vs Sri Lanka T20 Series: Decisive Third and Final T20I at Rajkot Today, Decisive Third and Final T20I at Rajkot Today, India vs Sri Lanka T20 Series Final, India vs Sri Lanka Final T20I, India vs Sri Lanka T20 Series, Final T20I at Rajkot Today, IND Vs SL 3rd T20I, IND vs SL Live, India Vs Sri Lanka 3rd T20I Live, IND Vs SL 3rd T20I News, IND Vs SL 3rd T20I Latest News And Updates, IND Vs SL 3rd T20I Live Updates, Mango News, Mango News Telugu

భారత్, శ్రీలంక జట్ల​ మధ్య మూడు టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైన విషయం తెలిసిందే. జనవరి 3న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన తోలి టీ20లో భారత్ జట్టు రెండు పరుగుల తేడాతో విజయం సాధించగా, జనవరి 5న పూణేలో జరిగిన రెండవ టీ20లో శ్రీలంక 16 పరుగులతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 7, శనివారం) రాత్రి 7 గంటల నుంచి చివరిదైన నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రాజ్‌కోట్‌ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, శ్రీలంక జట్లు చివరి కీలక టీ20లో తలపడనున్నాయి.

ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్‌ని కైవసం చేసుకోవడంపైనే భారత్, శ్రీలంక జట్లు దృష్టి సారించాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో యువ ఆటగాళ్లతో కూడిన భారత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొంత తడబడుతుండగా, మరోవైపు కెప్టెన్ దాసున్ షనక సారథ్యంలోని శ్రీలంక జట్టు దూకుడుగా ఆడుతూ రాణిస్తుంది. జరిగిన రెండు టీ20లు కూడా చివరివరకు పోటాపోటీగా ఉండడంతో, సిరీస్ ను నిర్ణయించే ఈ మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకుంది.

రెండు మ్యాచ్ లలో భారత్ జట్టు బ్యాటింగ్‌ లో టాప్‌ఆర్డర్‌ వైఫల్యం కొనసాగింది. శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్, రాహుల్‌ త్రిపాఠి ఆశించినమేర రాణించాల్సి ఉంది. సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో టీ20లో రాణించగా, కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా, దీపక్ హుడా కూడా సత్తా చాటాల్సి ఉంది. ఇక రెండో టీ20లో అర్ష్‌దీప్‌ సింగ్ ఏకంగా 5 నోబాల్స్‌ వేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో, అతనిపై ప్రత్యేక దృష్టి నెలకుంది. అలాగే ఉమ్రాన్‌ మాలిక్‌, శివమ్ మావి, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్ పరుగులు కట్టడి చేసి, మెరుగ్గా రాణించాలి. మరోవైపు శ్రీలంక జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ లో సత్తా చాటుతూ, మెరుగైన ప్రదర్శన చేస్తుంది. రాజ్‌కోట్‌ మైదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో, ఈ మ్యాచ్ లో విజయం సాధించి, సిరీస్ ను ఏ జట్టు దక్కించుకుంటుందో మరికొద్ది గంటల్లో తేలనుంది.

భారత్ తుది జట్టు అంచనా: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్/హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్.

శ్రీలంక తుది జట్టు అంచనా: పాతుమ్ నిస్సాంక, కుశాల్‌ మెండిస్‌ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దాసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహిశ్ తీక్షణ, దిల్షన్ మదుశంక, కసున్ రజిత.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 18 =