నేడు తెలంగాణలోని 119 నియోజకవర్గాల బూత్‌ కమిటీల సభ్యులతో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా భేటీ, వచ్చే ఎన్నికలకు దిశానిర్దేశం

BJP Chief JP Nadda To Meet All Booth Committee Members Of 119 Constituencies In Telangana Today, JP Nadda To Meet 119 Constituencies In Telangana, BJP To Hold Mega Booth Sammelan, BJP President JP Nadda, Telangana 119 Constituencies, 119 Constituencies, Bharatiya Janata Party, Committee Members Of 119 Constituencies, JP Nadda News, JP Nadda Latest News And Updates, JP Nadda Live Updates, JP Nadda Telangana Tour, Mango News, Mango News Telugu

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కుంచుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. దీనిలో భాగంగా పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో శనివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల పార్టీ పోలింగ్‌ బూత్‌ స్థాయి కమిటీల అధ్యక్షులు, సభ్యులతో ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించనున్నారు. వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన విధానాలు, కార్యక్షేత్రంలో అమలు చేయాల్సిన వ్యవహాలపై జేపీ నడ్డా దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో పోలింగ్ బూత్ స్థాయి నుండే వివరాలను అప్‌లోడ్ చేయడానికి గ్రౌండ్ లెవల్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు ఉపయోగించడం కోసం ‘సరళ్’ యాప్‌ను ప్రారంభించనున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి పార్టీ కార్యకర్తలకు ఈ యాప్ ద్వారా సమాచారం పంపించబడుతుంది. తద్వారా వారు తమ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లందరికీ దీనిపై అవగాహన కల్పించవచ్చు అనేది పార్టీ హైకమాండ్ ఆలోచనగా రాష్ట్ర బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే వచ్చే ఎన్నికల్లో 90 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న బీజేపీ అధిష్టానం, ‘మిషన్‌ 90’ పేరుతో తెలంగాణ నేతలకు రోడ్‌మ్యాప్‌‌ ఇవ్వనుంది. ఇక ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల బూత్‌ కమిటీ సభ్యులందరూ తప్పని సరిగా హాజరవ్వాలని రాష్ట్ర కమిటీ నియోజకవర్గాల నేతలకు బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ బూత్ కమిటీ సమావేశానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది నేతలు హాజరుకానున్నారని రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =