రేపే ఘనంగా ఐపీఎల్-2021 ప్రారంభం, ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రీడాభిమానులు

2021 Indian Premier League, indian premier league, Indian Premier League 2021, Indian Premier League 2021 matches, Indian Premier League 2021 Season, Indian Premier League 2021 Season Preview, Indian Premier League 2021 Starts From Tomorrow, indian premier league 2021 teams, IPL, IPL 2021, IPL 2021 Live Cricket Scores, ipl 2021 news, ipl 2021 schedule, IPL 2021 score, IPL 2021 Starts, IPL 2021 Updates, Mango News

క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2021 రేపు (ఏప్రిల్ 9, శనివారం) ఘనంగా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 9న తోలి మ్యాచ్ తో ఈ సీజన్ ప్రారంభమవనుండగా, మే 30న ఫైనల్‌ జరగనుంది. రేపు 2020 ఐపీఎల్ విజేత‌ ముంబయి ఇండియన్స్‌ మరియు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ తో క్రీడాభిమానులకు అత్యంత ఇష్టమైన ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ‌భారత కాలమానం ప్రకారం ఐపీఎల్ మ్యాచులు రాత్రి 7.30 గంటలకు, ‌మరియు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచులను కేవలం చెన్నై, ముంబయి, అహ్మదాబాద్‌, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి 6 వేదికలలోనే నిర్వహిస్తున్నారు.

ఈసారి కూడా ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు జరగనున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితులు దృష్ట్యా అన్ని నిబంధనలు పాటిస్తూ మ్యాచులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు, స్టేడియంలో సిబ్బంది కరోనా బారినపడ్డారు. దీంతో మ్యాచుల నిర్వహణ, ఆటగాళ్ల భద్రతా విషయంలో మరిన్ని జాగ్రత్తలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఈ సీజన్ విజయవంతంగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. క్రీడాభిమానులను ఉర్రుతలూగించే ఐపీఎల్ పై ఎప్పటిలాగానే భారీ హైప్ నెలకుంది. ఈ ఐపీఎల్ సీజన్ ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here