సూపర్‌స్టార్‌ కృష్ణ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

PM Narendra Modi and Rahul Gandhi Mourned the Demise of Tollywood Superstar Krishna,PM Narendra Modi,Celebrities Expressed Condolences,Superstar Krishna Passes Away,Tollywood Senior Actor Krishna, Superstar Krishna Hospitalized,Superstar Krishna Illness,Mango News,Mango News Telugu,Actor Superstar Krishna,Superstar Krishna,Senior Actor Krishna,Superstar Krishna Latest News And Updates,Actor Krishna, Actor Krishna Hospitalized,Krishna Hospitalized,Krishna News And Live Updates,Superstar News And Updates

ప్రముఖ సీనియర్ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, పలు పరిశ్రమల సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేసి, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, “కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు. ఈ విషాదకర సమయంలో ఆయన కుమారుడు, నటుడు మహేష్ బాబుకు, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి” అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ, “తెలుగు సినిమా సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ జీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అతని అసమానమైన వృత్తిపరమైన క్రమశిక్షణ మరియు వర్క్ ఎథిక్స్ ప్రజా జీవితంలో ప్రవర్తనపై ఒక ఉదాహరణగా నిలిచాయి. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − six =