మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, వీకెండ్ లాక్‌డౌన్ విధింపు

Madhya Pradesh, Madhya Pradesh Govt, Madhya Pradesh govt imposes lockdown, Madhya Pradesh Govt Imposes Weekend Lockdown, Madhya Pradesh Govt Imposes Weekend Lockdown in All Urban Areas, Madhya Pradesh imposes lockdown, Madhya Pradesh imposes weekend lockdown, Madhya Pradesh Lockdown, Mango News, MP govt imposes lockdown, Night curfew in urban areas of MP, Urban Areas, Weekend Lockdown, Weekend lockdown imposed in all cities of Madhya Pradesh

రాష్ట్రంలో పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నాడు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమీక్షనిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో వీకెండ్స్ లో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు తెలిపారు. కేసులు పెరుగుతున్న నగరాల్లో తగిన చర్యలు తీసుకుంటామని, అలాగే పెద్ద నగరాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజలందరూ పరిస్థితులను అర్ధం చేసుకోవాలని, ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలను పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 3,18,014 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,87,869 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,086 మంది మరణించారు. ప్రస్తుతం 26,059 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్ళీ ఆంక్షల బాటపడుతున్నాయి. మహరాష్ట్ర ప్రభుత్వం వీకెండ్ లాక్‌డౌన్‌, నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకురాగా, గుజరాత్‌, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాలు మళ్ళీ నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − one =