దేశంలో అదుపులోనే కరోనా, కొత్తగా BA.4, BA.5 కరోనా వేరియంట్స్ కేసులు గుర్తింపు

INSACOG Confirms the First Indian Cases of BA.4 and BA.5 Variants of Covid-19, INSACOG Confirms the First Indian Cases of BA.4 Variant of Covid-19, INSACOG Confirms the First Indian Cases of BA.5 Variant of Covid-19, Ministry of Health Confirms the First Indian Cases of BA.4 and BA.5 Variants of Covid-19, First Indian Cases of BA.4 and BA.5 Variants of Covid-19, BA.4 and BA.5 Variants of Covid-19, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, India Coronavirus, India Coronavirus Cases, India Coronavirus New Cases, India Coronavirus News, India New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, Covid-19 Updates in India, India corona State wise cases, India coronavirus cases State wise, Mango News, Mango News Telugu,

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం అదుపులోనే ఉన్నప్పటికీ మరిన్ని కొత్తవేరియంట్స్ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒమిక్రాన్ కరోనా వేరియంట్ సబ్ వేరియంట్స్ గా పరిగణిస్తున్న BA.4, BA.5 వేరియంట్స్ యొక్క తోలి కేసులు దేశంలో నమోదైనట్టు ఇండియన్ సార్స్ కోవ్-2 కన్సార్టియం ఆన్ జెనోమిక్స్ (ఇన్సాకాగ్) ఒక ప్రకటన విడుదల చేసింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పలు జాతీయ ప్రయోగశాలల సమూహంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఇన్సాకాగ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

తమిళనాడులోని 19 ఏళ్ల మహిళకు కరోనా యొక్క BA.4 వేరియంట్ సోకినట్లు కనుగొనబడిందని ఇన్సాకాగ్ ప్రకటించింది. ఆ మహిళకు తేలికపాటి క్లినికల్ లక్షణాలను మాత్రమే ఉన్నాయని, ఆమె రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుందని తెలిపారు. ఆమెకు ఎక్కడికి ప్రయాణం చేయలేదని పేర్కొన్నారు. అయితే దీనికి ముందు ఒక దక్షిణాఫ్రికా యాత్రికుడు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అతనికి BA.4 వేరియంట్‌ పాజిటివ్ గా నివేదించబడిందన్నారు.

మరోవైపు తెలంగాణలో 80 ఏళ్ల వ్యక్తికీ BA.5 వేరియంట్ పాజిటివ్ గా తేలిందని చెప్పారు. అతను తేలికపాటి క్లినికల్ లక్షణాల మాత్రమే కలిగిఉన్నాడని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాడని, అతనికి కూడా ఎలాంటి ప్రయాణ హిస్టరీ లేదని తెలిపారు. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఈ BA.4, BA.5 సోకిన వారి యొక్క కాంటాక్ట్ ట్రేసింగ్ చేయబడుతుందని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ యొక్క సబ్‌ వేరియంట్‌ లుగా BA.4 మరియు BA.5 ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చలామణిలో ఉన్నాయన్నారు. ఇవి మొదటగా ఈ సంవత్సరం ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో నివేదించబడ్డాయని, ఇప్పుడు విస్తరించబడి అనేక ఇతర దేశాల్లో ఈ వేరియంట్స్ నివేదించబడుతున్నాయని తెలిపారు. అయితే ఈ వేరియంట్స్ వలన వ్యాధి తీవ్రత కలగడం లేదా హాస్పిటల్స్ చేరేవారి సంఖ్య పెరగడం వంటివి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =