ఫిబ్రవరి 18న చెన్నైలో ఐపీఎల్-2021‌ వేలం

2021 Indian Premier League, IPL 2021, IPL 2021 Auction, ipl 2021 auction date, ipl 2021 auction date and time, ipl 2021 auction new players list, ipl 2021 auction news, IPL 2021 auction on February 18, IPL 2021 Auction players list, ipl 2021 auction updates, IPL 2021 Player retentions list, ipl 2021 schedule, IPL 2021 Trade Window Live Updates, IPL 2021 Updates, IPL Auction 2021 date, Mango News

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2021 ఆటగాళ్ల వేలం ఈసారి చెన్నైలో నిర్వహించబోతున్నారు. ఐపీఎల్‌ 14వ సీజన్ కోసం చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న తేదీన వేలం ప్రక్రియను నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ట్విట్టర్ ఖాతా నుండి అధికారికంగా ప్రకటించారు. ట్రేడింగ్ విండో కూడా ముగియడంతో వేలం పాట నిర్వహణపై ప్రకటన చేశారు. ఇప్పటికే 8 ప్రాంఛైజీలు 139 మంది ఆటగాళ్లను రెటైన్ చేసుకోగా, 57 మంది ఆటగాళ్లను వారి ప్రస్తుత జట్ల నుంచి విడుదల చేశారు.

మిగిలిన నిధులను ఈ వేలంలో జట్టు యాజమాన్యాలు ఉపయోగించుకోనున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వద్ద అత్యధికంగా రూ.53.20 కోట్లు మిగిలున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు వద్ద రూ.35.90 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో రూ.34.85 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.22.90 కోట్లు, ముంబయి ఇండియన్స్ రూ.15.35 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.12.9 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ ఖాతాలో రూ.10.75 కోట్లు, సన్ రైజర్స్ వద్ద రూ.10.75 కోట్లు మిగిలి ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − four =