ఫిట్‌మెంట్, పదవి విరమణ పెంపుపై కీలక సిఫార్సులు

Implement PRC, Implement PRC for govt staff, Mango News, Pay Revision Commission Report, Pay revision for employees, PRC Committee, PRC Committee Report, PRC report, Telangana Pay Revision Commission panel, Telangana Pay Revision Commission Report, Telangana Pay Revision Commission Report Released, Telangana Pay Revision Commission Report Released Today, Telangana PRC report, TS PRC Report Telangana

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ ల ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో పీఆర్‌సీ నివేదికలోని అంశాలపై ఈ రోజు సాయంత్రం చర్చించనున్నారు. సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని కమిషన్ వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) నివేదికను ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్, పదవి విరమణ వయసు పెంపు సహా పలు అంశాలపై పీఆర్‌సీ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది.

మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని పీఆర్‌సీ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలు ఉండాలని, గరిష్ఠ వేతనం రూ.1,62,070 వరకూ ఉండొచ్చని ప్రతిపాదించినట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు, గ్రాట్యుటీ ప‌రిమితి రూ.12 ల‌క్ష‌ల నుంచి రూ.16 ల‌క్ష‌ల‌కు పెంపు, హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు, శిశు సంర‌క్ష‌ణ సెలవులు 90 నుంచి 120 రోజుల‌కు, సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపుకు సూచించినట్టు తెలుస్తుంది. ఇక వేతన సవరణను జులై 1, 2018 నుంచి అమలుకు చేయాలని పీఆర్‌సీ నివేదికలో‌ సిఫార్సు చేసినట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =