భారత్, న్యూజిలాండ్​ మధ్య నేడు జరగాల్సిన తోలి టీ20 వర్షం కారణంగా రద్దు

First T20I Match Between New Zealand and India Abandoned without a Ball being Bowled at Wellington,New Zealand Vs India,NZ vs IND First T20I Match,New Zealand vs India T20,T20I at Sky Stadium,1st T20I Sky Stadium Wellington,Mango News,Mango News Telugu,NZ Vs IND,NZ vs IND T20I Series 2022,India vs New Zealand,IND vs NZ, 1st T20I,India in New Zealand,India Team Captain Hardik Pandya,NZ vs IND Weather Forecast,India vs New Zealand Latest News And Updates,IND Vs NZ in Prime Video,IND Vs NZ Live Score

భారత్, న్యూజిలాండ్ జట్ల​ మధ్య 3 టీ20ల సిరీస్ లో భాగంగా నేటి మధ్యాహ్నం (నవంబర్ 18, శుక్రవారం) 12 గంటల నుంచి వెల్లింగ్టన్ లోని స్కై స్టేడియంలో తోలి టీ20 జరగాల్సి ఉంది. అయితే భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. వెల్లింగ్టన్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా, ఈ మ్యాచ్ కు టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ ను రద్దు చేయాల్సి వచ్చింది. ముందుగా కొన్ని ఓవర్లతో అయినా మ్యాచ్ జరుగుతుందని భావించిన, వర్షం ఎంతకు తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తూ అంపైర్స్ నిర్ణయం తీసుకున్నారు. “వెల్లింగ్టన్‌లో ఆడడం సాధ్యం కాదు. తోలి టీ20 వర్షం కారణంగా రద్దు చేయబడింది” అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

ఇక ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ నవంబర్ 20, ఆదివారం నాడు మౌంట్‌ మాంగనుయ్‌ లోని బే ఓవల్ స్టేడియంలో జరగనుంది. గేమ్ జరగకపోవడం దురదృష్టకరమని, అభిమానులు చాలా ముందుగానే స్టేడియానికి వచ్చారని భారత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నారు. ఆటగాళ్లంతా మ్యాచ్ ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నామని, కానీ ప్రొఫెషనల్ క్రికెటర్లుగా వర్షం వలన మ్యాచ్ రద్దు కావడాన్ని అంగీకరించాల్సి ఉంటుందన్నారు.

న్యూజిలాండ్ తో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్:

  • మొదటి టీ20 – నవంబర్ 18 – స్కై స్టేడియం, వెల్లింగ్టన్
  • రెండో టీ20 – నవంబర్ 20 – బే ఓవల్, మౌంట్ మౌంగనుయి
  • మూడో టీ20 – నవంబర్ 22 – మెక్లీన్ పార్క్, నేపియర్

న్యూజిలాండ్ తో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్:

  • మొదటి వన్డే – నవంబర్ 25 – ఈడెన్ పార్క్, ఆక్లాండ్
  • రెండో వన్డే – నవంబర్ 27 – సెడాన్ పార్క్, హామిల్టన్
  • మూడో వన్డే – నవంబర్ 30 – హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + nineteen =