ఖమ్మంలో వైఎస్ షర్మిల సంకల్పసభ నేడే… భారీగా ఏర్పాట్లు

Khammam, Mango News, YS Sharmila, YS Sharmila Addresses Public Meeting At Khammam, YS Sharmila Launch New Party In Telangana, YS Sharmila Launches Political Party, YS Sharmila Launches Political Party In Telangana, YS Sharmila New Party, YS Sharmila New Party In Telangana, YS Sharmila New Party Name, YS Sharmila New Party Name In Telangana, YS Sharmila New Political Party, YS Sharmila New Political Party Announcement, YS Sharmila New Political Party Name, YS Sharmila Sankalpa Sabha, YS Sharmila Sankalpa Sabha at Khammam, YS Vijayaamma

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ సోదరి వైఎస్ షర్మిల ఈ రోజు ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ లో “సంకల్ప సభ” నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సభలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల ప్రకటన చేయడంతో పాటుగా పార్టీ పేరు, జెండా, అజెండాను ను ప్రకటించనున్నట్టు సమాచారం. వైఎస్ ష‌ర్మిల‌ త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌తో కలిసి శుక్రవారం ఉద‌యం 8 గంట‌ల‌కు హైదరాబాద్ లోని లోట‌స్ పాండ్ నుంచి భారీ వాహ‌న కాన్వాయ్ తో బయలుదేరారు. ఖ‌మ్మం వచ్చే దారి పొడువునా స్వాగ‌త కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంట‌ల‌కు వైఎస్ షర్మిల ఖ‌మ్మం చేరుకోనున్నారు.

సాయంత్రం 5 గంటలకు ప్రారంభించే ఈ సభలో అన్ని కోవిడ్ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. సభకు హాజరయ్యే వారికి మాస్క్ లు పంపిణీ చేయడం, శానిటైజర్లు ఏర్పాటు, ఇతర కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నారు. గ్రామాల నుంచి వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలి వచ్చి ఈ సంకల్ప సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ వైఎస్ షర్మిల టీం పిలుపునిచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు వైఎస్ షర్మిల ఇప్పటికే వరుసగా పలు జిల్లాల నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని, రాజన్న సంక్షేమ పాలన తేవాలన్నదే తన కోరిక అని వైఎస్ షర్మిల చెప్పారు. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వివరించి, ప్రజల సహకారంతో మళ్ళీ అలాంటి స్వర్ణ యుగాన్ని తెచ్చుకుందామని సమావేశాల సందర్భంగా నాయకులకు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 12 =