ఐపీఎల్ 2022: అలెక్స్‌ హేల్స్‌ స్థానంలో ఆరోన్‌ ఫించ్‌ ను కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

IPL-2022 Aaron Finch Joins Kolkata Knight Riders as a Replacement for Alex Hales, Aaron Finch Joins Kolkata Knight Riders as a Replacement for Alex Hales, Aaron Finch Joins Kolkata Knight Riders, Aaron Finch Joins KKR as a Replacement for Alex Hales, Alex Hales, Aaron Finch, Aaron Finch Joins KKR, Indian Premier League-2022, Indian Premier League, 2022 Indian Premier League, 2022 IPL, IPL 2022, IPL will Kick off on March 26, IPL 2022 will Kick off on March 26, Cricket, Cricket Latest News, Cricket Latest Updates, Indian Premier League, Indian Premier League Latest News, Indian Premier League Latest Updates, IPL, Mango News, Mango News Telugu,

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఆ నేపథ్యంలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండ్రోజుల పాటుగా బెంగళూరులో నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలంలో 10 ఫ్రాంచైజీలు కలిపి 204 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వేలంలో కొనుగోలు చేయబడ్డ కొందరు ఆటగాళ్లు పలు కారణాల దృష్ట్యా ఈ ఐపీఎల్ లో పాల్గొనలేకపోతుండడంతో వారి స్థానంలో ప్రాంఛైజీలు వేరే వారిని భర్తీ చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి మార్పుపై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) జట్టు ఒక ప్రకటన చేసింది. ఇంగ్లాండ్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌ స్థానంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులోకి ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ చేరాడు.

గత వేలంలో కేకేఆర్ కొనుగోలు చేసిన అలెక్స్‌ హేల్స్‌ ఎక్కువకాలం బయోబబుల్‌లో ఉండాల్సి రావడంతో ఈ ఐపీఎల్ నుంచి తప్పుకొన్నాడు. ఇక ఆరోన్‌ ఫించ్‌ ను గత వేలంలో ఏ జట్టు దక్కించుకోలేదు. ఈ క్రమంలో అలెక్స్‌ హేల్స్‌ స్థానంలో ఆరోన్‌ ఫించ్‌ ను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఈ మార్పుపై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ స్పందిస్తూ, “”అలెక్స్ హేల్స్ ఐపీఎల్ యొక్క రాబోయే సీజన్‌లో పాల్గొనడం కంటే కుటుంబాన్ని మరియు మానసిక క్షేమాన్ని ఎంచుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము. ఈ సీజన్‌లో అతనిని గెలాక్సీ ఆఫ్ నైట్స్‌లో కలిగి ఉండటాన్ని మేము కోల్పోతున్నాం, అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ ని నైట్ రైడర్స్ కుటుంబానికి స్వాగతించడం మాకు ఆనందంగా ఉంది. ముంబయిలోని మిగతా కేకేఆర్ జట్టులో చేరడం పట్ల అతను సంతోషిస్తున్నాడు. అతని అపారమైన అనుభవం నుండి ప్రయోజనం పొందేందుకు మేము ఎదురుచూస్తున్నాం” అని పేర్కొన్నారు. కాగా కేకేఆర్ కు ముందు ఆరోన్ ఫించ్‌ ఐపీఎల్ లో మొత్తం 8 ప్రాంచైజీల తరపున ప్రాతినిధ్యం వహించాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్:

పాట్ కమిన్స్ – రూ.7.25 కోట్లు
శ్రేయాస్ అయ్యర్ – రూ.2.25 కోట్లు
నితీష్ రాణా – రూ.8 కోట్లు
శివమ్ మావి – రూ.7.25 కోట్లు
షెల్డన్ జాక్సన్ – రూ.60 లక్షలు
అజింక్యా రహానె- రూ.1 కోటి
రింకూ సింగ్ – రూ.55 లక్షలు
అనుకుల్ రాయ్ – రూ.20 లక్షలు
రాసిఖ్ సలాం దార్ – రూ.20 లక్షలు
బాబా ఇంద్రజిత్ – రూ.20 లక్షలు
చమికా కరుణరత్నే – రూ.50 లక్షలు
అభిజీత్ తోమర్ – రూ.40 లక్షలు
ప్రథమ్ సింగ్ – రూ.20 లక్షలు
అశోక్ శర్మ – రూ.55 లక్షలు
సామ్ బిల్లింగ్స్ – రూ.2 కోట్లు
టిమ్ సౌతీ – రూ.1.50 కోట్లు
రమేష్ కుమార్ -రూ.20 లక్షలు
మహ్మద్ నబీ – రూ.1 కోటి
ఉమేష్ యాదవ్ – రూ.2 కోట్లు
అమన్ ఖాన్ – రూ.20 లక్షలు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 4 =