ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన ఈసీ

Ban on rallies in poll-bound states to continue till Jan 31, EC extends ban, EC extends ban on physical campaign rallies, EC extends ban on physical rallies, EC Extends Ban on Physical Rallies and Road Shows Till January 31, EC Extends Ban on Physical Rallies and Road Shows Till January 31 in 5 Poll-Bound States, EC extends ban on public rallies, EC extends ban on rallies and roadshows till January 31, ECI extends ban on physical rallies, Election Commission extends ban on physical rallies, Election Commission’s Ban On Rallies Extended, Mango News

త్వరలో శాసన సభల ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్ (ఈసీ) కొత్త ఆంక్షలు విధించింది. దీంతో.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలకు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో.. ప్రత్యక్ష బహిరంగ సభలు, రోడ్ షోల నిర్వహణపై నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించింది. ఈసీ శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, నిపుణులు, ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల అధికారులు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో సమావేశం అయింది. గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, శాసన సభల ఎన్నికల షెడ్యూలును ఈ నెల 8న ఎన్నికల కమిషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రోడ్ షోలు, బహిరంగ సభల నిర్వహణపై జనవరి 15 వరకు నిషేధం విధించింది ఎన్నికల కమిషన్. అనంతరం, ఈ నిషేధాన్ని జనవరి 22 వరకు పొడిగించింది. అయితే సమావేశ మందిరాల్లో గరిష్ఠంగా 300 మందితో లేదా 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే, ఇప్పుడు ఈ నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు జరిగే ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. అలాగే, మణిపూర్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కానీ, ఉత్తర ప్రదేశ్‌లో మాత్రం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =