ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ఎంఎస్ ధోని రికార్డ్

indian premier league 2020, IPL 2020, IPL 2020 News, IPL Record, ms dhoni, MS Dhoni overtakes Suresh Raina as most-capped player, MS Dhoni set to become the most-capped IPL, MS Dhoni set to surpass Suresh Raina, MS Dhoni sets foot on unique accolade, MS Dhoni To Become Most Capped Player in IPL

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) లో మరో రికార్డు నెలకొల్పాడు. ఈ రోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన మ్యాచ్‌ తో ఐపీఎల్ లీగులో అత్యధికగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే భారత మాజీ ఆటగాడు, బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా ఐపీఎల్ లో 193 మ్యాచులు ఆడాడు. ఇప్పటివరకు సురేశ్‌ రైనాతో కలిసి 193 మ్యాచులతో సమానంగా ఉన్న ఎంఎస్ ధోని, నేటి మ్యాచ్‌ తో ఎక్కువ మ్యాచులు ఆడిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మరోవైపు ఈ మ్యాచ్ తో ఐపీఎల్ ‌చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున అత్యధికంగా 164 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కూడా ఎంఎస్ ధోని గుర్తింపు పొందాడు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eighteen =