ఒడిశాలో నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 5 వరకు జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్

FIH Men’s Hockey Junior World Cup 2021, hockey, Junior Men’s Hockey World Cup-2021 to be held in Odisha, Junior Men’s Hockey World Cup-2021 to be held in Odisha from NOV 24 to DEC 5th, Junior Mens Hockey World Cup, Junior Mens Hockey World Cup-2021, Mango News, Odisha to host FIH Hockey Men’s Junior World Cup, Odisha to host FIH Hockey Men’s Junior World Cup 2021, Odisha to host Junior Men’s Hockey World Cup, Odisha to host Men’s Junior Hockey World Cup 2021

ఒడిశా ప్రభుత్వం భారత మహిళలు మరియు పురుషుల హాకీ జట్లకు అధికారిక స్పాన్సర్‌ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హాకీకి సంబంధించిన మరో ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఒడిశా రాష్ట్రం వేదిక కానుంది. జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్-2021 ఒడిశాలో జరగనుంది. ఒడిశాలోని కళింగ స్టేడియంలో నవంబర్‌ 24, 2021 నుంచి డిసెంబర్‌ 5, 2021 వరకు పురుషుల జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ నిర్వహించనున్నారు.

ఈ టోర్నమెంట్ లోగోను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం నాడు ఆవిష్కరించారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి తక్కువ సమయంలోనే ఏర్పాట్లు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. భారత్ తో పాటుగా ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, ఈజిప్ట్, కొరియా, మలేషియా, బెల్జియం, పాకిస్తాన్, కెనడా, ఇంగ్లాండ్, చిలీ, అర్జెంటీనా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, స్పెయిన్ వంటి 15 దేశాలు ఈ టోర్నమెంట్ లో పాల్గొననున్నాయి. కాగా 2016 లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − six =