బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి బ్రాహ్మణ కార్పోరేషన్‌, ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Andhra Pradesh, AP Backward Classes Welfare Dept, ap brahmin s welfare corporation, AP Govt Decided to Transfer Brahmin Welfare Corporation, AP Govt Decided to Transfer Brahmin Welfare Corporation to Backward Classes Welfare Dept, AP News, AP State Economically Backward Classes, Backward Classes Welfare Dept, brahmin welfare board, Brahmin Welfare Corporation to Backward Classes Welfare Dept, Mango News, Transfer Brahmin Welfare Corporation to Backward Classes Welfare Dept

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బ్రాహ్మణ కార్పోరేషన్‌ ను దేవాదాయశాఖ పరిధి నుంచి బదిలీ చేసింది. ప్రస్తుతం రెవెన్యూ (దేవాదాయ) శాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌ ను అందులోంచి తప్పిస్తూ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకువస్తునట్టు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్రాహ్మణ కార్పోరేషన్‌ ను బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని ఆర్థికంగా వెనుకబడిన కార్పొరేషన్లలో భాగం చేయడం మరియు మరింత మెరుగైన సమన్వయం సాధించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ (దేవాదాయ), వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + eleven =