బల పరీక్షకు సిద్ధమంటున్న కుమార స్వామి

Karnataka CM Kumaraswamy Seeks Trust Vote In Assembly
Karnataka CM Kumaraswamy Seeks Trust Vote In Assembly

కర్ణాటక రాజకీయ సంక్షోభం,శుక్రవారం నాడు శాసనసభలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి చేసిన ప్రకటన తో మరో మలుపు తిరిగింది. శాసన సభలో సుదీర్ఘంగా మాట్లాడిన కుమార స్వామి, జరుగుతున్న పరిణామాలు తనను కలిచివేస్తున్నాయని,తన ప్రభుత్వ బలమెంటో నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ రమేష్ కుమార్ ని కోరారు. బల నిరూపణకు తేదీలు నిర్ణయించి, అవకాశం కల్పించాలని స్పీకర్ ని కోరారు. కుమార స్వామి చేసిన ఈ ప్రకటనతో, అటు బిజెపి నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సుమారు 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాల తర్వాత, వరుసగా జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో, బిజెపి నేతలు ముఖ్యమంత్రి ప్రకటన పట్ల అప్రమత్తం అయ్యి, ఎమ్మెల్యేలను ఎదైన రిసార్ట్ కి తరలించాలని నిర్ణయించుకున్నారు. ఇతర సభ్యుల ప్రసంగాల తర్వాత, శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

మరోవైపు అసమ్మతి నేతల పిటిషన్ ని విచారించిన సుప్రీం కోర్టు, మంగళ వారం దాక రాజీనామాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని, యధాస్థితిని కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. స్పీకర్ తరుపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి రాజీనామాల పై నిర్ణయం తీసుకోడానికి స్పీకర్ సమయం కోరారని, కోర్టుకు విన్నవించారు. కొద్దిసేపు వాదనల తరువాత కేసులో సంక్లిష్టత గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి , ఎమ్మెల్యేలపై ఎలాంటి అనర్హత వేటు గాని, రాజీనామాలు ఆమోదించడం గాని చేయకుండ ఉండాలని కేసుని మంగళవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పు తో బిజెపి నేతలు నిరాశకి గురయ్యారు. ఈ మూడు రోజుల్లో ఏలాంటి పరిణామాలు జరుగుతాయోనని ఎదురుచూస్తున్నారు.ఇంకో వైపు కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ మళ్ళీ అసంతృప్తి నేతలతో చర్చలు జరపడానికి సిద్ధమయ్యారు, అందులో భాగంగా ఎంబీటీ నాగరాజు, డాక్టర్ కే. సుధాకర్ ని కలిసి చర్చలు జరిపి, రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని కోరారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here