కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, జూన్ 14 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

Coronavirus Update, Karnataka, Karnataka Extends Lockdown, Karnataka Government, Karnataka Government Extends Lockdown, Karnataka Government Extends Lockdown Till 14th June, Karnataka Govt, Karnataka govt announces lockdown, Karnataka Lockdown, Lockdown in Karnataka, Lockdown in Karnataka Till 14th June, Mango News

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా వ్యాప్తిని నివారించడానికి రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ ను జూన్ 14 వరకు పొడిగిస్తునట్టు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం నాడు ప్రకటించారు. “కర్ణాటకలో లాక్‌డౌన్‌ జూన్ 14 వరకు పొడిగించబడుతుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు అన్ని నియమాలను పాటించాలని, ప్రభుత్వంతో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని సీఎం యడియూరప్ప పేర్కొన్నారు.

అలాగే జూన్‌ నెలలో 60 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఇప్పటివరకు 1.41 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని, జూన్ నెలాఖరు వరకు కర్ణాటక 2 కోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసుకుంటుందని అన్నారు. అలాగే చలనచిత్ర మరియు టీవీ పరిశ్రమ కార్మికులు, మత్స్యకారులు, ఆశా మరియు అంగన్వాడీ వర్కర్స్, నేత కార్మికులు మరియు ప్రార్థనా స్థలాల్లో పనిచేసే వ్యక్తులకు ప్రత్యేక రిలీఫ్ ప్యాకేజి అందజేయనున్నట్టు తెలిపారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు 26,53,446 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23,36,096 మంది కరోనా నుంచి కోలుకోగా, 30,531 మంది మరణించారు. ప్రస్తుతం 2,86,798 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fourteen =