కేరళలో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ – సీఎం పినరయి విజయన్

Kerala CM Pinarayi Vijayan Says COVID Vaccine Will Be Distributed Free In The State,Kerala CM Pinarayi Vijayan,COVID Vaccine,Kerala,Kerala State,Mango News,Mango News Telugu,CM Pinarayi Vijayan Says COVID Vaccine Will Be Distributed Free In Kerala,Coronavirus,COVID Vaccine To Be Free For People Of Kerala Says CM Pinarayi Vijayan,CM Pinarayi Vijayan,Will Vaccinate People For Free In Kerala Says CM Pinarayi Vijayan,Chief Minister Pinarayi Vijayan,COVID-19 Vaccine To Be Provided Free Of Cost In Kerala,Kerala CM Announces Free Covid Vaccine For All In State,Free Covid Vaccine Offer By Kerala CM

దేశంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్న నేపథ్యంలో పంపిణీకి కావాల్సిన సన్నద్ధతపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేరళ సీఎం పినరయి విజయన్ కీలక ప్రకటన చేశారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేరళ ప్రజలకు ఉచితంగా అందిస్తామని సీఎం పినరయి విజయన్ శనివారం నాడు ప్రకటించారు.

“ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రజలు ఈ విషయంపై ఆలోచన చేస్తున్నారు. కేరళలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ ఉచితంగానే ప్రజలకు అందించబడుతుంది. వ్యాక్సిన్ కోసం ఎవరినుంచి డబ్బు తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఉచిత వ్యాక్సిన్ పంపిణీ కోసం అన్ని చర్యలు తీసుకుంటాము” అని సీఎం విజయన్ వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే దేశంలో తమిళనాడు సీఎం పళనిస్వామి, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కూడా ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు ఉచితంగానే పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here