గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం, తేదిలివే…

APPSC Made All Arrangements To Group-1 Mains Exams,APPSC Made All Arrangements To Group-1 Mains,APPSC Arrangements To Group-1 Mains Exams,APPSC Group-1 Mains Exams,APPSC Group 1 Notification,APPSC Group 1 Exam Pattern,APPSC Group 1 Latest News,APPSC Group 1 Notification 2020,APPSC Group 1 Exam Date 2020,APPSC Mains Exams,APPSC Announces Group-1 Mains Exams,Andhra Pradesh,APPSC Announces Group-1 Mains Exams Conducted From Dec 14 To 20,Mango News,Mango News Telugu,APPSC 2020,APPSC 2020 Group-I Main Exam,APPSC Group 1 Exam Dates 2020,APPSC Group 1 Services Main Exam In December,APPSC Group 1 Mains 2020,APPSC APPSC Made All Arrangements To Group 1 Mains Exam 2020

రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఈ పరీక్షల కోసం ఏపీలో 13 జిల్లాలతో పాటుగా హైదరాబాద్ లో మొత్తం 41 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన మొత్తం 9,679 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా ఇప్పటికి 8099 మంది అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు జరగనుండగా, ఉదయం 8:45 గంటల నుంచి 9:30 గంటల మధ్య మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్టు పేర్కొన్నారు.

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌ టికెట్‌ తో పాటుగా ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని రావాలని ‌ సూచించారు. ఇక ప్రశ్నపత్రం ఇంగ్లీష్/తెలుగు వెర్షన్ లలో టాబ్ ద్వారా అందించబడుతుందని చెప్పారు. ట్యాబ్‌ ద్వారా పరీక్ష రాసే విధానానికి సంబంధిన డెమో వీడియోను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ (https://psc.ap.gov.in/) లో‌ అందుబాటులో ఉంచారు. కరోనా నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని నిబంధనలు పాటించాలని సూచించారు.

గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్:

  • 14.12.2020 – తెలుగు (క్వాలిఫయింగ్‌ పేపర్)
  • 15.12.2020 – ఇంగ్లీష్ (క్వాలిఫయింగ్‌ పేపర్)
  • 16.12.2020 – పేపర్-I
  • 17.12.2020 – పేపర్-II
  • 18.12.2020 – పేపర్-III
  • 19.12.2020 – పేపర్-IV
  • 20.12.2020 – పేపర్-V
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here