మహారాష్ట్ర: ఈసీ ఆదేశాలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం

Maharashtra Ex CM Uddhav Camp Moves SC Against EC Order To Prove Majority on Shinde Group's Plea, EC Order To Prove Majority on Shinde Group's Plea, Shinde Group's Plea, Maharashtra Ex CM Uddhav Camp Moves SC, Former CM Uddhav Thackeray camp moves SC against EC order, Uddhav Thackeray faction of the Shiv Sena, Uddhav Thackeray Moves SC challenging the proceedings of the Election Commission on Maharashtra CM Eknath Shinde Plea, Maharashtra CM Eknath Shinde Plea, Eknath Shinde Plea, Election Commission, Maharashtra Ex CM Uddhav Thackeray, Ex CM Uddhav Thackeray, Shiv Sena Party, Eknath Shinde Plea News, Eknath Shinde Plea Latest News, Eknath Shinde Plea Latest Updates, Eknath Shinde Plea Live Updates, Mango News, Mango News Telugu,

మహారాష్ట్రలో రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి. తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఏక్‌నాథ్ షిండే పార్టీని కూడా హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో షిండే నేతృత్వంలోని బృందం ఎన్నికల సంఘం ముందు పిటిషన్‌ను దాఖలు చేసింది. అత్యున్నత న్యాయస్థానంలో అనేక పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున సీఎం షిండే వర్గం అభ్యర్థనను కొనసాగించవద్దని అభ్యర్థిస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం పోల్ ప్యానెల్‌కు లేఖ రాసింది. కాగా షిండే గ్రూప్ అభ్యర్ధనపై స్పందించిన ఎన్నికల సంఘం (ఈసీ) పార్టీ యొక్క శాసనసభ మరియు సంస్థాగత విభాగాల నుండి మద్దతు లేఖలు మరియు ప్రత్యర్థి వర్గాల వ్రాతపూర్వక ప్రకటనలతో సహా పత్రాలను సమర్పించాలని ఇరుపక్షాలను కోరింది. అలాగే ఆగస్టు 8లోగా తమ మెజారిటీని నిరూపించుకోవాలని మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వర్గాన్ని ఆదేశించింది.

దీనిపై ఆందోళన చెందిన ఉద్ధవ్‌ వర్గం ఈసీ ఆర్డర్‌కు వ్యతిరేకంగా దీనిపై స్టే విధించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిందని, ఆ అంశంపై ఒక నిర్ణయం తీసుకునేంత వరకూ ఈసీ తదుపరి చర్యలు చేపట్టకుండా చూడాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. సాధారణంగా ఏదేని ఒక పార్టీకి గుర్తులు కేటాయించడం, ఎన్నికలు నిర్వహించడం వంటి రాజ్యాంగ బాధ్యతలే ఈసీకి ఉన్నాయని, అంతకు మించి నిర్ణయాలు తీసుకునే అధికారం దానికి లేదని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. మరోవైపు ఇటీవలి మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సమయంలో శివసేన మరియు దాని తిరుగుబాటు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లు రాజ్యాంగపరమైన సమస్యలను లేవనెత్తాయని, వీటిని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని జూలై 20న సుప్రీంకోర్టు పేర్కొనటం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 1 =