మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్‌సిపి నేత అజిత్ పవార్‌

Maharashtra NCP Leader Ajit Pawar Selected as The New Opposition Leader in Assembly, NCP Leader Ajit Pawar elected as Leader of Opposition in Maharashtra Legislative Assembly, Leader of Opposition in Maharashtra Legislative Assembly, Maharashtra Legislative Assembly, Maharashtra Assembly, Leader of Opposition, New Opposition Leader in Maharashtra Assembly, Maharashtra NCP Leader Ajit Pawar, Maharashtra NCP Leader Ajit Pawar becomes new leader of opposition in Maharashtra assembly, NCP Leader Ajit Pawar, Maharashtra NCP Leader. Ajit Pawar, NCP Leader, Maharashtra Assembly New Opposition Leader News, Maharashtra Assembly New Opposition Leader Latest News, Maharashtra Assembly New Opposition Leader Latest Updates, Maharashtra Assembly New Opposition Leader Live Updates, Mango News, Mango News Telugu,

మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, సీనియర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు అజిత్ పవార్‌ను సోమవారం సభలో ప్రతిపక్ష నాయకుడిగా, అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు పవార్ పేరును ఎన్‌సిపి శాసనసభా పక్ష నేత జయంత్ పాటిల్ ప్రతిపాదించారని, 288 మంది సభ్యుల సభలో ఎన్‌సిపి అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించడంతో అసెంబ్లీ ఆమోదించిందని స్పీకర్ రాహుల్ నార్వేకర్ తెలిపారు. ఈ రోజు జరిగిన ఫ్లోర్ టెస్ట్‌లో మెజారిటీ సాధించిన తర్వాత తన మొదటి అసెంబ్లీ ప్రసంగం చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, పవార్‌ను పరిణతి చెందిన రాజకీయవేత్త మరియు నిర్వాహకుడిగా అభివర్ణించారు.

కాగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల శిబిరంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చివేసిన షిండే, రెండు రోజుల ప్రత్యేక సభ సమావేశాల చివరి రోజున సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో శివసేన శాసనసభ్యులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందారని అన్నారు. అయితే తనతో రావాలని తాను ఎవరినీ బలవంతం చేయలేదని షిండే పునరుద్ఘాటించారు. ఈరోజు శాసనసభలో బాల పరీక్షలో షిండే నెగ్గిన విషయం తెలిసిందే. 288 మంది సభ్యులున్న సభలో బలపరీక్షలో గెలవాలంటే 144 మంది మద్దతు అవసరం కాగా, షిండేకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 99 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ముగ్గురు శాసనసభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండగా, కాంగ్రెస్‌కు చెందిన అశోక్ చవాన్, విజయ్ వాడెట్టివార్ సహా 21 మంది శాసనసభ్యులు గైర్హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =