దేశంలో మరో 21 కొత్త సైనిక్ స్కూల్స్ ఏర్పాటుకు రక్షణశాఖ అనుమతి

Ministry of Defence Approves Setting up of 21 New Sainik Schools All Over India, 21 New Sainik Schools All Over India, 21 New Sainik Schools, New Sainik Schools, Ministry of Defence, Ministry of Defence Approves 21 New Sainik Schools, MoD approves 21 new Sainik schools, Sainik schools, MoD, Defence Ministry Approves Setting up of 21 New Sainik Schools All Over India, Defence Ministry, New Sainik Schools All Over India, Mango News, Mango News Telugu,

దేశవ్యాప్తంగా 21 కొత్త సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయటానికి రక్షణశాఖ అనుమతి ఇచ్చింది. మొత్తంగా దేశంలో 100 కొత్త సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో, రక్షణ మంత్రిత్వ శాఖ NGOలు, ప్రైవేట్ పాఠశాలలు లేదా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించింది. రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, ఈ కొత్త పాఠశాలలు ప్రస్తుతం ఉన్న సైనిక్ పాఠశాలలకు కొంచెం భిన్నంగా ఉంటాయి. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ఈ పాఠశాలల ఏర్పాటుకు ప్రధాన లక్ష్యం. అయితే ఈ కొత్త సైనిక్ పాఠశాలల ద్వారా సాయుధ దళాలలో చేరడంతోపాటు వారికి మెరుగైన కెరీర్ అవకాశాలను కల్పించడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష.

నేటి యువతను రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా దేశ నిర్మాణానికి ప్రభుత్వంతో చేతులు కలపడానికి ప్రైవేట్ రంగానికి కూడా ఇది అవకాశం ఇస్తుంది. ఈ కొత్త సైనిక్ స్కూల్స్, సంబంధిత ఎడ్యుకేషన్ బోర్డులకు అనుబంధం కాకుండా, సైనిక్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో పనిచేస్తాయి మరియు సొసైటీ సూచించిన పార్టనర్‌షిప్ మోడ్‌లో కొత్త సైనిక్ స్కూల్స్ కోసం నియమాలు మరియు నిబంధనలను అనుసరిస్తాయి. ఇక కొత్తగా ఏర్పాటు చేయనున్న 21 పాఠశాలల్లో.. 14 పాఠశాలల్లో హాస్టల్ వసతి కల్పించనున్నారు. మరో 7 పాఠశాలల్లో కేవలం డే స్కూల్స్ విధానంలో పనిచేస్తాయి. అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను పంచుకుంటూ, కొత్త సైనిక్ స్కూల్స్‌లో ప్రవేశం VI తరగతి స్థాయిలో ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. E-కౌన్సెలింగ్ ద్వారా NTA నిర్వహించే ఆల్-ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల నుండి VI తరగతిలో కనీసం 40 శాతం ప్రవేశం ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 13 =