ఆస్కార్‌ నామినేషన్స్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ ‘కాంతారా’ సహా 10 భారతీయ చిత్రాలు.. రిమైండర్ లిస్ట్ ప్రకటించిన అకాడమీ

Oscar 2023 10 Indian Films Including RRR and Kantara Gets Place in Nominations Reminder List,RRR, Gangubai Kathiawadi,The Kashmir Files, Chhello Show (Last Film Show),India's official Oscar Entry,Vivek Agnihotri's The Kashmir Files, Marathi Me Vasantrao,Tujhya Sathi Kahi Hi, R Madhavan's Rocketry: The Nambi Effect,Iravin Nizhal,Kannada Movie Vikrant Rona,Mango News,Mango News Telugu,Oscar Nominations 2023 India List,Rrr Oscar Nominations 2023,Ffi India,Rrr Nominated For Oscar,Oscar 2023 Nominations,Film Federation Of India Jury Members,Film Federation Of India Members,Film Federation Of India President

95వ ఆస్కార్‌ నామినేషన్స్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ ‘కాంతారా’ సహా మొత్తం 10 భారతీయ చిత్రాలు నిలిచాయి. ఈ మేరకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్‌లకు అర్హత సాధించిన 301 చలన చిత్రాల జాబితాను విడుదల చేసింది. కాగా భారతీయ చిత్రాలలో టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్, సంజయ్ లీలా భన్సాలీ యొక్క గంగూబాయి కతియావాడి, వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ది కాశ్మీర్ ఫైల్స్ మరియు కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా తదితర చిత్రాలు ఉన్నాయి.

ఈ జాబితాలో భారతదేశం యొక్క అధికారిక ఆస్కార్ ఎంట్రీ అయిన పాన్ నలిన్ యొక్క ‘ఛెల్లో షో’ కూడా ఉంది. అలాగే ఇతర సినిమాలలో మరాఠీ సినిమాలు మి వసంతరావు, తుజ్యా సతీ కహీ హై, తమిళ స్టార్ హీరో ఆర్ మాధవన్ నటించిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్, ఇరవిన్ నిజల్ మరియు కన్నడ చిత్రం ‘విక్రాంత్ రోణా’ కూడా ఉన్నాయి. షౌనక్ సేన్ మరియు కార్తికీ గోన్సాల్వ్స్ యొక్క ది ఎలిఫెంట్ విస్పరర్స్ యొక్క డాక్యుమెంటరీ ఆల్ దట్ బ్రీత్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కాగా ఆస్కార్‌ అవార్డులకు నామినేట్ అయిన చిత్రాల జాబితాను జనవరి 24న ప్రకటిస్తారు. ఇక మార్చి 12న ఆస్కార్ అవార్డులను ప్రకటించి ప్రదానం చేస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here