కేంద్రం కీలక నిర్ణయం, దేశంలో మంకీపాక్స్ కేసుల నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

Centre Forms Task Force to Monitor Monkeypox Situation in India, Centre Govt Forms Task Force to Monitor Monkeypox Situation in India, Task Force to Monitor Monkeypox Situation in India, Monkeypox Situation in India, Task Force to Monitor Monkeypox Situation, Centre forms task force to monitor Monkeypox virus situation, Monkeypox virus situation, task force to monitor monkeypox virus situation in nation, Monkeypox cases in India, India Monkeypox cases, Monkeypox Task Force News, Monkeypox Task Force Latest News, Monkeypox Task Force Latest Updates, Monkeypox Task Force Live Updates, Mango News, Mango News Telugu,

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పలుదేశాలను తాజాగా మంకీపాక్స్ వ్యాధి కలవరపెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంకీపాక్స్ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తూ అన్ని దేశాలు దృష్టి సారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించిన విషయం తెలిసిందే. భారత్‌లో ఇప్పటివరకు మొత్తం నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి, ఇందులో కేరళ రాష్ట్రంలో మూడు మరియు ఢిల్లీలో ఒకటి ఉన్నాయి. కాగా కేరళలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో 22 ఏళ్ల యువకుడు జూలై 30, ఆదివారం నాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ యువకుడు ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుండి కేరళలోని త్రిసూర్ జిల్లాకు తిరిగి వచ్చాడు. అతని శాంపిల్స్ ను పూణే లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపగా మంకీపాక్స్‌ సోకినట్లుగా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తితో పది మంది ప్రత్యక్షంగా కాంటాక్ట్ లో ఉన్నారని, అయితే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 20 మందిని ఇప్పటివరకు క్వారంటైన్ లో ఉంచినట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. అలాగే కేరళలో మంకీపాక్స్ నిర్ధారణ అయిన మరో ఇద్దరుకూడా పరిశీలనలో ఉన్నారని, వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు తెలిపారు.

ఇక దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌ మంకీపాక్స్ వ్యాధికి సంబంధించి రోగనిర్ధారణ సౌకర్యాల విస్తరణపై ప్రభుత్వానికి పర్యవేక్షణ మరియు మార్గదర్శకత్వం అందించడం, దేశంలో మంకీపాక్స్ వ్యాప్తిని నిరోదించేలా వ్యాక్సిన్ ను అన్వేషించనుంది. టాస్క్‌ఫోర్స్‌కు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ నేతృత్వం వహించనుండగా, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో పాటు బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి మరియు ఫార్మా ఉన్నతాధికారులుతో కలిపి మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్నారు. మంకీపాక్స్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్రాలు తీసుకుంటున్న క్లినికల్ చర్యలను టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణ చేస్తూ, ఈ విషయంలో వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం చేయనుంది. మరోవైపు డబ్ల్యూహెచ్‌ఓ సమాచారం ప్రకారం, ఇప్పటికి 75 దేశాల్లో16,000 కు పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలోనే 5,000కు పైగా కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్టు తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =