ప్రధాని మోదీతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ మేకర్స్ భేటీ

Oscar Winning Documentary Short Film The Elephant Whisperers Makers Meet PM Modi,Oscar Winning Documentary Short Film,The Elephant Whisperers,Elephant Whisperers Makers Meet PM Modi,PM meets makers of award winning documentary,Mango News,Mango News Telugu,PM meets team of Oscar winner,The Elephant Whisperers Makers,The Elephant Whisperers Makers Latest News,The Elephant Whisperers Latest Updates,Oscar Win,Oscar Award 2023,Oscar Awards,Indian Prime Minister Narendra Modi

ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్‌ మోంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో భారత్ నుంచి నామినేట్‌ అయి ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్’ కు గెలుచుకున్న ఆస్కార్‌ అవార్డులను వారు ప్రధాని మోదీకి అందించి సంతోషాన్ని పంచుకున్నారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “ది ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమా యొక్క గొప్పతనం మరియు విజయం ప్రపంచ దృష్టిని అలాగే ప్రశంసలను ఆకర్షించింది. ఈరోజు ఈ ఫిల్మ్ కి సంబంధించిన తెలివైన బృందాన్ని కలిసే అవకాశం నాకు లభించింది. వారు భారతదేశం గర్వపడేలా చేశారు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ట్వీట్ పై నిర్మాత గునీత్‌ మోంగా స్పందిస్తూ, “మీ ఇంటికి మమ్మల్ని స్వాగతించినందుకు మరియు మా చిత్రాన్ని గౌరవించినందుకు ధన్యవాదాలు. మీ మద్దతు మరియు ప్రోత్సాహం మాకు చాలా ముఖ్యమైనది. భారతదేశ వైవిధ్యం మరియు గొప్పతనాన్ని ప్రతిబింబించే మేక్ ఇన్ ఇండియా ప్రభావవంతమైన కంటెంట్‌ని కొనసాగించడానికి మేము ఎదురుచూస్తున్నాము” అని పేర్కొన్నారు.

ముందుగా మార్చి 12న లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో భారత్ నుంచి నామినేట్‌ అయిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్’ ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌ని గునీత్ మోంగా, కార్తికి గోన్సాల్వేస్, డగ్లస్ బ్లష్, అచిన్ జైన్ నిర్మించగా, కార్తికి గోన్సాల్వేస్ డైరెక్ట్ చేశారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భారత్ తరపున తొలి అవార్డును ఈ షార్ట్ ఫిల్మ్ ద‌క్కించుకుంది. ఆస్కార్‌ అవార్డు ప్రకటన అనంతరం దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్‌ మోంగా అవార్డులను అందుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 2 =