శ్రీరామ న‌వ‌మి వేళ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో విషాదం.. మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి, ప్రధాని మోదీ సంతాపం

Madhya Pradesh 11 People Lost Lives in Temple Stepwell Collapsed at Indore During Sri Rama Navami Celebrations,Madhya Pradesh 11 People Lost Lives in Temple,Temple Stepwell Collapsed at Indore,Temple Stepwell Collapsed During Sri Rama Navami,Sri Rama Navami Celebrations,Mango News,Mango News Telugu,Baleshwar Temple Floor Sinks,11 People Including 2 Women Died,CM Announces EX Gratia For Baleshwar People,Several trapped as temple floor sinks,13 killed in Indore as temple floor caves,Ram Navami celebrations,Temple floor sinks during Ram Navami,Ram Navami celebrations at India go awry,Baleshwar Temple Incident Latest News,Baleshwar Temple Live Updates,Baleshwar Temple Latest Updates

శ్రీరామ న‌వ‌మి వేళ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. గురువారం పండుగ సందర్భంగా ఇండోర్‌లోని ఒక ఆలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులు భారీగా హాజరయ్యారు. ఈ క్రమంలో భక్తులు ఎక్కువమంది రావడంతో స్థలం సరిపోక కొంతమంది ఆలయం ప్రాంగణంలో ఉన్న ఒక పురాతన ‘బావడి’ (పెద్ద బావి) పైకి ఎక్కారు. అయితే అకస్మాత్తుగా పైకప్పు కూలిపోవడంతో దానిపైనున్నవారు ఒక్కసారిగా కింద బావిలోకి పడిపోయారు. ఈ ఘటనలో 11 మంది భ‌క్తులు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ అధికారులు, పోలీసులు మరియు విపత్తు నిర్వహణ బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. మొత్తం 18 మందిని రక్షించిన అధికారులు లోపల మరో ఏడుగురు ఇంకా చిక్కుకుని ఉన్నట్లు గుర్తించి సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఇలా తెలిపారు.. ఇండోర్‌లో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తో మాట్లాడాను. అక్కడి పరిస్థితిపై ఆయన వివరాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన రెస్క్యూ మరియు రిలీఫ్ పనులకు నాయకత్వం వహిస్తోంది. బాధితులకు మరియు వారి కుటుంబాలకు నా ప్రార్థనలు’ అని పేర్కొన్నారు. మరోవైపు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ దీనిపై స్పందిస్తూ.. ఘటనపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించామని, అయితే దురదృష్టవశాత్తు కొంతమంది మరణించారని తెలిపారు. మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, అలాగే వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − seven =