పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు: 17మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

17 Lok Sabha MPs Test Positive, 17 MPs test positive for coronavirus, 17 MPs Test Positive For Covid-19, Monsoon Session of Parliament, Monsoon Session of Parliament Begins, Parliament, Parliament Monsoon Session, Parliament monsoon session live updates, parliament monsoon session today, Parliament Monsoon Session Updates, Parliament session live updates

ఈ రోజు నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమావేశాలకు హాజరయ్యే ఎంపీలకు కరోనా నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే సభలోకి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఉభయ సభల ఎంపీలందరికీ ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు రాగా మొత్తం 17మంది ఎంపీలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు.

కరోనా పాజిటివ్ గా తేలిన వారిలో బీజేపీ ఎంపీలు 12 మంది ఉండగా, వైసీపీ ఎంపీలు ఇద్దరు, శివసేన, డీఎంకే, ఆర్‌ఎల్‌పీ పార్టీలకు చెందిన ఎంపీలు ఒక్కొక్కరు ఉన్నట్టు తెలిపారు. ఉభయసభల్లో దాదాపుగా 200 మంది ఎంపీలు 60-65 సంవత్సరాల పైబడినవారే ఉండడంతో సమావేశాల నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్పల్ప లక్షణాలున్నా అనుమతించకుండా, పరీక్షల్లో నెగటివ్ రిపోర్ట్ వస్తేనే సభలోకి అనుమతి ఇస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + six =