రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

Dhyan Chand Award, Khel Ratna Award Renamed as Major Dhyan Chand Khel Ratna Award, Major Dhyan Chand Khel Ratna Award, Mango News, PM Modi, PM Modi Announced That Rajiv Gandhi Khel Ratna Award Renamed as Major Dhyan Chand Khel Ratna Award, Rajiv Gandhi Khel Ratna Award, Rajiv Gandhi Khel Ratna award rechristened, Rajiv Gandhi Khel Ratna Award Renamed, Rajiv Gandhi Khel Ratna Award renamed after Hockey legend, Rajiv Gandhi Khel Ratna Award Renamed as Major Dhyan Chand Khel Ratna Award

దేశంలో క్రీడలకు సంబంధించి అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డు పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. “ఖేల్ రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టాలని నేను భారత దేశవ్యాప్తంగా పౌరుల నుండి అనేక అభ్యర్ధనలు అందుకుంటున్నాను. వారి అభిప్రాయాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పౌరుల మనోభావాలను గౌరవిస్తూ, ఖేల్ రత్న అవార్డు ఇకపై మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పిలువబడుతుంది” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

మరోవైపు దిగ్గజ హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ పుట్టినరోజైన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ధ్యాన్ చంద్ నేతృత్వంలోని హాకీ జట్టు ఒలింపిక్స్ లో మూడు స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఇక దేశంలో అత్యుత్తమ ప్రతిభ చూపే క్రీడాకారులను సత్కరించేందుకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం 1991-92లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ప్రారంభించారు. ఈ పురస్కారం కింద పతకం, సర్టిఫికెట్ మరియు రూ. 25 లక్షల నగదు బహుమతిని అందిస్తున్నారు. ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తోలి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 10 =