రేపే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష.. 997 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి, ఒక్క నిమిషం లేటైనా నో ఎంట్రీ

AP Police Constable Preliminary Exam to be Held on Tomorrow Recruitment Board Gives Key Suggestions For The Candidates,AP Police Constable,AP Police Constable Preliminary Exam,Police Constable Preliminary Exam,Mango News,Mango News Telugu,AP Police Constable Latest News and Updates,Ap Police Si Notification 2022,Ap Police Constable Selection Process,Ap Constable Syllabus,Ap Constable Apply Online 2022,Constable Notification 2022 Ap Last Date,Ap Constable Notification 2023,Apslprb,Ap Constable Age Limit 2023,Ap Police Si Notification 2022,Ap Govt Constable Notification,Ap Constable Posts,Ap Constable Posts Notification 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి రేపు (ఆదివారం) ప్రాథమిక రాత (ప్రిలిమినరీ) పరీక్ష జరుగనుంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. అలాగే పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష పూర్తయిన తర్వాత ఏపీ స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆన్సర్ కీని తన అధికారిక వెబ్‌సైట్‌ ap.gov.inలో అందుబాటులో ఉంచుతుంది. ప్రశ్న బుక్‌లెట్ సిరీస్ ఎ,బి,సి మరియు డి ఆప్షన్లతో కూడిన కీ పేపర్ ఉంచబడుతుంది. కాగా రాష్ట్రంలోని మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు గాను 5.03 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 997 కేంద్రాల్లో ఈ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా కేంద్ర వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కొన్ని కీలక సూచనలు చేసింది.

ప్రిలిమినరీ పరీక్ష రాయనున్న అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేసిన కీలక సూచనలు..

  • అభ్యర్థులు ఒకరోజు ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి వెళ్లి నిర్ధారించుకుంటే మంచిది.
  • పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది.
  • అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
  • అయితే 10 గంటల తర్వాత ఒక్క నిమిషం లేటైనా వారిని లోపలకు అనుమతించరు.
  • అభ్యర్థులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, రేషన్ కార్డులలో ఎదో ఒకటి ఒరిజినల్ గుర్తింపు కార్డు ఖచ్చితంగా తీసుకురావాలి.
  • ఇక అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో తమవద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంచుకోరాదు.
  • మొబైల్ ఫోన్స్, టాబ్స్, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్, బ్లూటూత్, కాలిక్యులేటర్ వంటివి తీసుకురాకూడదు.
  • పరీక్షా సమయాల్లో పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.
  • అలాగే పరీక్షా క్యాంటర్‌కు 100 మీటర్ల పరిధిలో ఎవరూ తమ వాహనాలను పార్క్ చేయకూడదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =