నేను కూడా NCC లో భాగమైనందుకు గర్వంగా ఉంది.. ప్రధాని నరేంద్ర మోదీ

guard of honour rules in india, how to join ncc, Mango News, ncc air wing, ncc camp, ncc day, ncc guard of honour commands, pm narendra modi, PM Narendra Modi inspects Guard of Honor, PM Narendra Modi inspects Guard of Honor at Cariappa, PM Narendra Modi Proud of Being an Active Member, PM Narendra Modi Proud of Being an Active Member Of NCC, PM Narendra Modi Proud of Being an Active Member Of NCC Once, Proud of being an active member of NCC once

దేశం పట్ల తన బాధ్యతలను నిర్వర్తించేందుకు అమితమైన బలం తనకు NCCలో పొందిన శిక్షణ వల్ల లభిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో జరిగిన NCC ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. NCC గణతంత్ర దినోత్సవాల శిబిరం ముగింపు సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 28న ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తమ కేడెట్లకు పతకాలు, బ్యాటన్లను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మీలాగే నేను కూడా ఒకప్పుడు చురుకైన NCC కేడెట్‌నని చెప్పదానికి గర్వంగా ఉంది. గతంలో NCCలో నేను పొందిన శిక్షణ, నేర్చుకున్న విషయాలు, దేశం పట్ల నా బాధ్యతలను నిర్వర్తించడంలో నేడు నేను అద్భుతమైన శక్తిని పొందుతున్నాను’’ అన్నారు. స్వాతంత్య్రం లభించి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా.. దేశం అమృత మహోత్సవాలను జరుపుకుంటోందన్నారు మోదీ. ఈ ప్రత్యేక సందర్భంలో.. కరియప్ప మైదానంలో జరుగుతున్న ఈ సంబరాలు చాలా ప్రత్యేకమైనవని,  తాను అటువంటి ఉత్తేజాన్ని చూస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here