రంజీ ట్రోఫీ రెండు దశల్లో నిర్వహిస్తాం.. బీసీసీఐ

bcci, BCCI Announces Ranji Trophy To Be Held in Two Phases, BCCI Ranji Trophy 2022 To Be Held In Two Phases, Jay Shah Announces Return Of Ranji Trophy, Mango News, ranji player, Ranji Trophy, Ranji Trophy 2022, ranji trophy 2022 schedule, ranji trophy 2022 winner, Ranji Trophy to be held in two phases, Ranji Trophy to be Held in Two Phases Knockouts in June, Shah confirms Ranji Trophy

రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. మొదటి విడతలో లీగ్ దశ మ్యాచ్ లను పూర్తి చేస్తామని తెలిపింది. అలాగే, జూన్ లో నాకౌట్ మ్యాచ్ లను నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ తాజా నిర్ణయంతో ఫిబ్రవరి రెండో వారంలో రంజీ ట్రోఫీ మొదటి విడత ప్రారంభం కానునట్లు తెలుస్తోంది. మరోవైపు ఐపీల్ మార్చి 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఒకే విడతలో రంజీ ట్రోఫీని నిర్వహించటం కష్టం. అందుకే రెండు విడతలుగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా తదితరులు పాల్గొన్న బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి రంజీ ట్రోఫీని విస్మరిస్తే భారత క్రికెట్ కు వెన్నెముక లేకుండా పోతుందని అన్నాడు. దేశవాళీ క్రికెట్ ద్వారానే నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకి వస్తారని రవిశాస్త్రి పేర్కొన్నాడు. రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే.. రెండు దశల్లో రంజీ ట్రోఫీని నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here