మాయావతికి ముఖ్యమంత్రి పదవి కూడా ఆఫర్ చేశాం, కానీ ఆమె ఆసక్తి చూపలేదు – రాహుల్ గాంధీ

Rahul Gandhi Congress Offered Mayawati UP Chief Minister Post But She Declined, Congress Offered Mayawati UP Chief Minister Post But She Declined, Mayawati Declined UP Chief Minister Post Says Rahul Gandhi, Congress offered Mayawati UP CM post, UP CM post, Congress leader Rahul Gandhi, UP Politics, Indian National Congress president, Indian National Congress president Rahul Gandhi, Mayawati hits back at Rahul Gandhi, Rahul Gandhi, Rahul Gandhi claimed that the Congress offered to make her the chief ministerial candidate in UP, UP Politics Latest News, UP Politics Latest Updates, UP Politics Live Updates, BSP supremo Mayawati, Mayawati, Mango News, Mango News Telugu,

ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పొత్తు పెట్టుకుని ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిని చేస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసిందని, అయితే ఆమె మాతో మాట్లాడలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రతిపాదనకు మాయావతి ఆసక్తి చూపలేదు, బహుశా ఆమెకు బీజేపీతో రహస్య ఒప్పందం ఉండి ఉండొచ్చు అని రాహుల్ శనివారం వ్యాఖ్యానించారు. మాయావతి “సిబిఐ, ఇడి మరియు పెగాసస్” కారణంగా రాష్ట్రంలోని అధికార బిజెపికి స్పష్టమైన మద్దతు తెలిపారని బీఎస్పీ చీఫ్‌పై ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకుగాను, కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఏకంగా 97 శాతం మంది కాంగ్రెస్ అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయారు. బీఎస్పీ కేవలం ఒక సీటుతో పాటు దాదాపు 13 శాతం ఓట్లను మాత్రమే గెలుచుకుంది. దాదాపు 72 శాతం మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు.

ఉత్తరప్రదేశ్‌లో బిజెపి మరియు సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ జరిగింది. అయితే, ఎన్నికలలో యోగి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలోని బిజెపి మరోసారి అధికారాన్ని నిలుపుకుంది. నేడు ‘ద దళిత్ ట్రూత్’ అనే పుస్తకాన్ని విడుదల చేసిన రాహుల్ గాంధీ.. రాజ్యాంగం ఒక ఆయుధమని, అయితే పాలకులు దానిని త్రికరణశుద్ధితో ఆచరించినప్పుడే దానిని మనం గౌరవిస్తున్నట్లని తెలిపారు. సంస్థలను ప్రజలు నియంత్రించకపోతే, దేశం కూడా నియంత్రించబడదని రాహుల్ గాంధీ స్పష్టం చేసాడు. ప్రస్తుతం దేశంలో ‘సిబిఐ’ మరియు ‘ఈడి’ వంటి దర్యాప్తుసంస్థలు రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తున్నాయని గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో దశాబ్దాలుగా గుర్తింపుకు నోచుకోని దళిత వర్గాల గళం వినిపించటంలో రాజకీయ శక్తులకు ఎదురొడ్డి నిలిచినందుకు బీఎస్పీ అధినేత కాన్షీరామ్‌పై తనకు అపార గౌరవం ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here