హైదరాబాద్‌లోని పబ్‌లలో ఇకపై స్పెషల్ డ్రైవ్‌లు.. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Telangana Excise Minister Srinivas Goud Warns Pub Owners Against Drug Trade in Hyderabad, Telangana Excise Minister Srinivas Goud Warns Pub Owners, Telangana Excise Minister Srinivas Goud, Excise Minister Srinivas Goud, Telangana Excise Minister, Srinivas Goud, Pub Owners, Drug Trade in Hyderabad, Drug Trade in Telangana, Drug Trade, Drug Trade News, Drug Trade in Hyderabad Latest News, Drug Trade in Hyderabad Latest Updates, Drug Trade in Hyderabad Live Updates, Telangana Excise Minister V Srinivas Goud warned the pub owners in Hyderabad, Telangana Excise Minister V Srinivas Goud Says Strict action against those found guilty of drug abuse, drug abuse, Mango News, Mango News Telugu,

హైదరాబాద్‌లోని పబ్‌లలో ఇకపై స్పెషల్ డ్రైవ్‌లు చేపడతామని వెల్లడించారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. డ్రగ్స్‌ వ్యవహారం వలన తెలంగాణకు చెడ్డపేరు వస్తోందని, ఇకపై దీనిని సహించబోమని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. రాజధాని హైదరాబాద్‌ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, అందుకే రాష్టానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ పేరు ప్రతిష్టలకు భంగం కలిగే ఏ చర్యలనైనా అడ్డుకుంటామని, దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

హైదరాబాద్ లోని పబ్‌లలో కొందరు డబ్బు కోసం అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని మంత్రి హెచ్చరించారు. పబ్స్ పెట్టి వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే అలాంటి వారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు‌. అలాగే వారు టైం ప్రకారం పబ్స్ నిర్వహించుకోవాలని, అనుమతిచ్చిన సమయానికన్నా ఎక్కువసేపు నిర్వహించుకోవడం కుదరదని తెలిపారు. ఎవరైనా దీనిని అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్. నగరంలోని పబ్‌లలో తప్పనిసరిగా సీసీటీవీలు ఏర్పాటు చేయాలనీ, అలాగే వాటిని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి అనుసంధానిస్తామని కూడా తెలియజేశారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here