ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్

Assembly Election Results 2026 LIVE Counting Begins in West Bengal, Tamil Nadu, Kerala, Assam and Puducherry

దేశంలోని ఐదు రాష్ట్రాలు (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు, మే 4, 2026 (సోమవారం) ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైంది. మధ్యాహ్నం సమయానికి పూర్తిస్థాయిలో ఫలితాల సరళి స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత ట్రెండ్స్ మరియు తాజా అప్‌డేట్స్ ఇక్కడ ఉన్నాయి.

రాష్ట్రం మొత్తం స్థానాలు ఆధిక్యంలో ఉన్న పార్టీ/కూటమి తాజా సమాచారం
పశ్చిమ బెంగాల్ 294 బిజెపి (BJP) బిజెపి-తృణమూల్ (టీఎంసీ) మధ్య హోరాహోరీ పోరు. బిజెపి మ్యాజిక్ ఫిగర్ (148) దిశగా సాగుతుండటం విశేషం.
తమిళనాడు 234 డిఎంకే (DMK) విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ ఫిగర్ (118) దిశగా దూసుకుపోతోంది. ఎం.కే. స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే వెనుకంజలో ఉండటం గమనార్హం.
కేరళ 140 యుడిఎఫ్ (UDF) కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ (71)
అస్సాం 126 బిజెపి (BJP) హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బిజెపి హ్యాట్రిక్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. మ్యాజిక్ ఫిగర్ (63)
పుదుచ్చేరి 30 NDA (AINRC-BJP) ఎన్.రంగస్వామి నేతృత్వంలోని కూటమి ముందంజలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ (16)

 

  • బెంగాల్ సమరం: మమతా బెనర్జీ (TMC) నేతృత్వంలోని ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. బిజెపి తొలిసారిగా బెంగాల్ పీఠాన్ని దక్కించుకునే దిశగా ముందంజలో ఉంది. ముఖ్యంగా 89 లక్షల ఓట్ల తొలగింపు అంశం ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

  • తమిళనాడులో విజయ్ ఫ్యాక్టర్: తమిళనాట ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అనేక స్థానాల్లో ఆధిక్యంలో ఉండి, అధికార డీఎంకే (AIADMK)ని మూడో స్థానానికి నెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

  • 100కి పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో టీవీకే. పోటీ చేసిన 2 స్థానాలు తిరుచ్చి, పెరంబూరులలో విజయ్ ముందంజ.

  • ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేతో పాటుగా టీవీకే సమానంగా సీట్లు తెచుకుంటుండటం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తుంది. పూర్తి ఫలితాలు వెల్లడయ్యే సమయానికి టీవీకే మ్యాజిక్ ఫిగర్ అందుకునే అవకాశాలు కూడా లేకపోలేదని వారు అంచనా వేస్తున్నారు.

  • కేరళలో మార్పు: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ (UDF) అధికారం దిశగా సాగుతోంది.

  • అస్సాంలో బిజెపి జోరు: హిమంత బిశ్వ శర్మ హవా కొనసాగుతోంది. 70కి పైగా స్థానాల్లో బిజెపి కూటమి ఆధిక్యంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here