మరోసారి రెపో రేటు తగ్గించిన ఆర్‌బీఐ

latest political breaking news, Lowest Since March 2010, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019, RBI Breaking News, RBI Cuts Repo Rate, RBI Cuts Repo Rate By 25 bps, RBI Cuts Repo Rate By 25 bps To 5.15%, RBI Cuts Repo Rate By 25 bps To 5.15% Lowest Since March 2010, RBI Latest Updates, reserve bank of india latest news

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను వరుసగా అయిదోసారి తగ్గించింది, ప్రస్తుతం 5.40 శాతంగా ఉన్న రెపో రేటును 25 బీపీఎస్‌ పాయింట్ల మేర తగ్గించి 5.15 శాతంగా నిర్ణయించింది. ఇక రివర్స్ రెపో రేటును 4.9 శాతంగా ఉంది, బ్యాంకు రేటు 5.40 శాతంగా నిర్ణయించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన సమావేశమైన ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన పరపతి కమిటీ (ఎంపిసి), నాలుగవ ద్వి-నెలవారీ విధాన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఎంపిసి సభ్యులందరూ రెపో రేటును తగ్గించడానికి అనుకూలంగా ఓటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఈ రెపో రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. దీంతో రెపోరేట్‌ 2010 నాటికి చేరింది. ఆర్ధిక మందగమనాన్ని దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లను తగ్గించినట్టుగా తెలుస్తుంది. మరో వైపు 2019-2020 ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 6.9 శాతం నుంచి 6.1 శాతానికి సవరించారు. 2020-2021 సంవత్సరానికి కూడ జీడీపీ అంచనాను 7.2 గా సవరిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వృద్ధిని సాధించేందుకు కొంత కాలం పాటు ఇదే పరిస్థితిని కొనసాగించబోతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here