వరుసగా పదోసారి కూడా రెపో రేటు, రివర్స్‌ రెపో రేట్లు యథాతథం, ఆర్‌బీఐ కీలక నిర్ణయాలు

Governor Shaktikanta Das says Repo, Governor Shaktikanta Das says Repo Reverse Repo Rates Unchanged for 10th time, Latest News on repo rate and reverse repo rate, Mango News, No repo rate cut, RBI, RBI Monetary Policy, RBI Monetary Policy 2021, RBI Monetary Policy Live, RBI Monetary Policy today, RBI Monetary Policy Updates, RBI MPC decision, Repo and Reverse Repo Rate, Repo and Reverse Repo Rate Unchanged, Repo rate reverse repo rate remain same, Repo Rate Unchanged, reserve bank of india, Reserve Bank of India Announced that Repo and Reverse Repo Rate Unchanged, Reverse Repo Rates Unchanged for 10th time

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) మూడు రోజుల సమావేశం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ఉదయం వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లపై యథాతథస్థితిని కొనసాగిస్తామని తెలిపారు. రెపో రేటు, రివర్స్ రెపో రేట్లలో ఎలాంటి మార్పులు లేవన్నారు. ప్రస్తుతమున్న 4 శాతం రెపో రేటు, 3.35 శాతం రివర్స్‌ రెపో రేటు అలాగే అమలు కానున్నట్లు తెలిపారు. దీంతో వరుసగా పదోసారి కూడా కీలక పాలసీ రేట్లపై యథాతథస్థితి కొనసాగనుంది.

ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి 7.8 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి 9.2 శాతంగా ఉంటే ఆర్థిక వ్యవస్థను మహమ్మారి ముందు స్థాయి కంటే ఎక్కువగా తీసుకువెళుతుందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. అలాగే 2022-23కి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4.5% వద్ద ఆర్‌బీఐ అంచనా వేసింది. Q1 2022-23 లో 4.9%, Q2 వద్ద 5% ఉండొచ్చని తెలిపారు. ఈ-రూపి ప్రీపెయిడ్ డిజిటల్ వోచర్ కింద ప్రస్తుత క్యాప్ ను మెరుగుపరుస్తున్నామని, ప్రస్తుతం ఉన్న రూ.10000 క్యాప్ ఒక్కో వోచర్‌కు రూ.1 లక్షకు పెంచబడుతుందన్నారు మరియు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించకోవచ్చని చెప్పారు. వాణిజ్య సంబంధిత సెటిల్‌మెంట్ల కోసం నాచ్ ఆదేశ పరిమితి కూడా రూ.3 కోట్లకు పెంచబడుతుందని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 12 =