సరికొత్త చర్చకు దారితీస్తున్న జెనెటిక్ చికెన్ క్రియేషన్

Genetic Chicken Creation Stirs A New Debate Across The World,Genetic Chicken Creation Stirs,A New Debate Across The World,Chicken Creation Stirs A New Debate,Mango News,Mango News Telugu,Naked chickens, Geneticist,Poultry Specialist,The Hebrew University of Jerusalem, Professor Avigdor Kahner, Unethical genetic modification, Broiler chicken,Applications of Gene Editing in Chickens,Genetically modified chickens,Genetic Chicken Creation Latest News,Genetic Chicken Creation,Genetic Chicken Creation Latest Updates,Genetic Chicken Latest News,Genetic Chicken Live Updates,Chicken Creation Stirs Debate News Today,Chicken Creation Stirs Debate Latest news,Chicken Creation Stirs Debate Latest Updates

సైన్స్ ప్రకృతికే సవాల్ విసురుతూ సృష్టిస్తోన్న కొన్ని వస్తువులు అందరి మన్ననలూ అందుకుంటే మరికొన్ని మాత్రం ప్రారంభంలోనే కాంట్రవర్శీకి దారి తీస్తుంటాయి. అలాగే ఇప్పుడు జన్యు శాస్త్రవేత్తలు తయారు చేసిన నేక్డ్ కోళ్లు.. వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎందుకంటే మనం రెగ్యులర్ గా చూస్తున్న నాటుకోళ్లు, బ్రాయిలర్ కోళ్లు శరీరంపై ఈకలు ఉంటాయి అయితే చికెన్ కోసం మాత్రం ఈకలు తీసేసి వాడుతుంటారు. కానీ ఇప్పుడు అసలు ఎలాంటి ప్రాసెస్ చేయకుండానే ఈకలు లేని కోళ్లను జన్యు శాస్త్రవేత్తలు తయారుచేయడంతో ఆందోళన వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా బ్రాయిలర్ కోళ్లు వేడి చేస్తాయని చాలామంది వాటికి దూరంగా ఉంటారు. అలాగే మరోవైపు మారుతున్న వాతావరణంతో..ఉష్ణోగ్రతలను తట్టుకోలేక య బ్రాయిలర్ కోళ్లు చనిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇజ్రాయెల్ జన్యు శాస్త్రవేత్త (Geneticist), పౌల్ట్రీ నిపుణుడు (Poultry Specialist), జెరూసలేంలోని హిబ్రూ యూనివర్సిటీ (The Hebrew University of Jerusalem)కి చెందిన ప్రొఫెసర్ అవిగ్డోర్ కాహనర్ (Professor Avigdor Kahner)ఎక్కువ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలిగిన ఈకలు లేని నేక్డ్ కోళ్లను సృష్టించాడు.

నేక్డ్ కోళ్ల శరీర జీవక్రియ.. ఇతర కోళ్ల జాతుల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉంటుందని ప్రొఫెసర్ చెబుతున్నారు. అంతేకాదు.. ఇవి చాలా వేగంగా బరువును పెరుగుతాయని.. దీనివల్ల వీటిలో ఎక్కువ మాంసం కలిగి ఉంటుందని అంటున్నారు. పెరుగుతున్న చికెన్ డిమాండ్‌కు తగ్గట్లు ఇవి ఉంటాయని.. దీనివల్ల ఫౌల్ట్రీ పరిశ్రమలు కూడా పెరిగి జీవనాధారం పెరుగుతుందని ప్రొఫెసర్ అభిప్రాయ పడుతున్నారు.

ప్రొఫెసర్ చెప్పింది సమంజసంగానే ఉన్నా.. ఇప్పుడు వాటి ఆకారమే ఇవి వివాదాస్పదంగా మారుతోంది. ఈకలు లేని కోళ్లను క్రియేట్ చేసిన అవిగ్డోర్ కాహనర్ అసహజ (abnormal), అనైతిక జన్యు మార్పుల (Unethical genetic modification)ను ఆశ్రయించాడని చాలామంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు తయారుచేసిన ఈకలు లేని కోళ్లు.. పరాన్నజీవులు (Parasites), దోమల దాడులు (Mosquito attacks), చర్మవ్యాధులు (Skin diseases), వడ దెబ్బ (sunstroke) వంటి పరిస్థితుల వల్ల ప్రమాదకరంగా మారతాయని వాదిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ కోళ్లలో సంభోగ ప్రక్రియ (mating process) కూడా ఇబ్బందిగా ఉంటుందని.. రెక్కలు, ఈకలు లేకపోవడంతో.. అవి సమతుల్యత (balance)ను కొనసాగించలేవని చెబుతున్నారు.

కానీ ఈ విమర్శలన్నీ ఆధారం లేని ఆరోపణలు మాత్రమేనని జన్యు శాస్త్రవేత్త కాహనర్ కొట్టిపడేస్తున్నారు. తాను సాధారణంగా మన మధ్య ఉండే బ్రాయిలర్ కోడి (Broiler chicken)ని ఆధారంగా చేసుకొని మాత్రమే.. బేర్ నేక్డ్ జాతి (Naked chickens)ని సృష్టించానని చెబుతున్నారు. ఇది జన్యుపరంగా మార్పు చెందిన చికెన్ కాదని.. ఇంకా చెప్పాలంటే 50 ఏళ్ల క్రితం సహజమైన కోడికి.. ఎలాంటి లక్షణాలు ఉండేవే అవి మాత్రమే నేక్డ్ కోళ్లకు ఉన్నాయని వాదిస్తున్నారు. పైగా ఈ కోళ్లు వాటి అసాధారణ రూపం (Unusual shape)తో ఉండటంతో పాటు.. చాలా లాభాలు కలిగి ఉన్నాయని అంటున్నారు ప్రొఫెసర్. వేగంగా వృద్ధి రేటు (Faster growth rate)ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా కూలర్లు అవసరం లేకుండానే ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగల సామర్థ్యం.. నేక్డ్ కోడిలో ఉందని చెబుతున్నారు. ఒకవైపు ఈ చికెన్ తినడంపై ఆందోళనలు, మరోవైపు ఆరోగ్యానికి, ఆదాయానికి కూడా మంచిదేనని.. విశ్లేషణతో కూడిన వాదన మధ్య వచ్చిన నేక్డ్ కోళ్లు ఎంత వరకూ సక్సెస్ అవుతాయో వేచి చూడాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 1 =