భారతదేశంలో మార్చి నెలలో 18 లక్షలకు పైగా ఖాతాలను బ్లాక్ చేసిన ‘వాట్సాప్’ కంపెనీ

India WhatsApp Bans More Than 18 Lakh Accounts in The Country During March Month, 18.05 lakh Indian accounts were banned by WhatsApp between March 1-31, WhatsApp Bans More Than 18 Lakh Accounts in The Country, 18 Lakh Accounts, WhatsApp Bans 18 Lakh Accounts, WhatsApp Accounts, March Month, India, WhatsApp Banned More Than 18 Lakh Accounts in The Country During March Month, WhatsApp Accounts News, WhatsApp Accounts Latest News, WhatsApp Accounts Latest Updates, 18 lakh Indian WhatsApp accounts were banned in March 1-31, WhatsApp banned over 1.8 million accounts in the month of March 1-31, Mango News, Mango News Telugu,

భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ‘వాట్సాప్’ కంపెనీ ఒక సంచలన నివేదిక వెల్లడించింది. దానిప్రకారం, భారతదేశంలో కొత్త ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా ఒక్క మార్చి నెలలోనే దేశవ్యాప్తంగా 18 లక్షల బ్యాడ్ యూజర్ ఖాతాలను నిషేధించినట్లు ప్రముఖ కంపెనీ ‘వాట్సాప్’ పేర్కొంది. ఈ మేరకు విషయాన్ని వాట్సాప్ మాతృసంస్థ అయిన ‘మెటా’ స్పష్టం చేసింది. అయితే అంతకుముందు ఫిబ్రవరి నెలలో, ‘వాట్సాప్’ కంపెనీ అటువంటి 14 లక్షల ఖాతాలను బ్లాక్ చేయడం గమనార్హం. వాట్సాప్ తన నెలవారీ నివేదికలో ‘బాన్ అప్పీల్’ గురించి మొత్తం 407 ఫిర్యాదులు అందాయని, వాటిలో 74 ఖాతాలపై ‘చర్యలు’ తీసుకున్నట్లు పేర్కొంది. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ మొత్తం 597 ఫిర్యాదులను అందుకుంది. ఇందులో ఖాతా మద్దతు, బ్యాన్ అప్పీళ్లు, ఉత్పత్తి మద్దతు మరియు ఇతర విషయాలలో భద్రత గురించి ప్రశ్నలు ఉన్నాయి.

“మా వినియోగదారుల నుంచి స్వీకరించబడిన ఫిర్యాదులపై సంబంధిత చర్యలు తీసుకొన్నాము. మా ప్లాట్‌ఫారమ్‌లో ఇలాంటి దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి మేము ఇంతటి తీవ్రమైన చర్యలు తీసుకోక తప్పడం లేదు. అలాగే గడచిన కొన్ని సంవత్సరాలుగా, మేము మా ప్లాట్‌ఫారమ్‌లో మా వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అత్యున్నత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నాం. ఇండియాలో మొన్నటి మార్చి నెలలో 1.8 మిలియన్ (18,05,000) ఖాతాలను నిషేధించాము. వాట్సాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021లోని రూల్ 4(1)(డి) ప్రకారం నెలవారీ నివేదికలను విడుదల చేస్తుంది. ఫిర్యాదు నివేదికలు మరియు నిబంధనల ఉల్లంఘనల ఆధారంగా ప్లాట్‌ఫారమ్ చర్యలు తీసుకుంటుంది” అని ఒక ప్రకటనలో ‘వాట్సాప్’ ప్రతినిధి తెలిపారు.

“గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా వినియోగదారు ఫిర్యాదులకు ప్రతిస్పందించడం మరియు వాటిపై చర్య తీసుకోవడంతో పాటు, ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన ప్రవర్తనను నిరోధించడానికి ‘వాట్సాప్’ ప్రయత్నం చేస్తుంది. మేము ముఖ్యంగా నివారణపై దృష్టి పెడుతున్నాము, ఎందుకంటే హాని సంభవించిన తర్వాత దానిని గుర్తించడం కంటే హానికరమైన కార్యకలాపాలను జరగకుండా ప్రారంభంలోనే ఆపడం చాలా మంచిదని మేము విశ్వసిస్తున్నాము. ఖాతాలో దుర్వినియోగాన్ని గుర్తించడం అనేది మూడు దశల్లో పనిచేస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో, సందేశం పంపే సమయంలో మరియు ప్రతికూల అభిప్రాయానికి ప్రతిస్పందనగా, మేము వినియోగదారు నివేదికలు మరియు బ్లాక్‌ల రూపంలో స్వీకరిస్తాము” అని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =