కరోనా నేపథ్యంలో ముంబయి నగరంలో మళ్ళీ 144 సెక్షన్ అమలు

Coronavirus In Mumbai, Coronavirus Lockdown, Coronavirus Pandemic, Mumbai, Mumbai 144 Section, Mumbai Lockdown Extension, Mumbai Police imposes Section 144, Section 144 Imposed in Mumbai City, Section 144 in Mumbai

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒక్క ముంబయి నగరంలోనే ఇప్పటికి 77,658 కేసులు నమోదవగా, 4556 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ముంబయిలో మళ్లీ 144 సెక్షన్‌ విధించారు. పరిస్థితులను బట్టి ముందే ఉపసంహరించకపోతే ఈ 144 సెక్షన్ జూలై 15 వరకు అమల్లో ఉండనున్నట్టు ముంబయి డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ప్రణయ అశోక్ తెలిపారు. బహిరంగ, మతపరమైన ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమిగూడి ఉండడాన్ని నిషేధించినట్టు ప్రకటించారు.

అలాగే నగరంలో మున్సిపల్ అధికారులు ఇప్పటికే గుర్తించిన కంటైన్మెంట్ జోన్స్ లో నిత్యావసర వస్తువుల సరఫరా, అత్యవసర వైద్య అవసరాల నిమిత్తం తప్ప ఒకరు కంటే ఎక్కువమంది వ్యక్తుల కదలికలను నిషేధించినట్టు చెప్పారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. మరోవైపు జూన్ 30 నాటికీ మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,74,761 కు చేరుకుంది. వీరిలో 90,911 మంది కోలుకోని డిశ్చార్జ్ అవగా, 7855 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 75,979 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + seventeen =