సివిల్‌ సర్వీసెస్ ప్రిలిమ్స్-2020: అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను మార్చుకునే అవకాశం

civil services prelims 2020 postponed, Civils Prelim, Civils Prelim 2020, IAS Prelims 2020, Prelims-2020 Candidates Choice of Centre, Prelims-2020 Candidates to Revise their Choice of Centre, UPSC Gives a Chance to Civils Prelims-2020 Candidates

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష‌-2020 షెడ్యూల్ ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష అక్టోబర్ 4, 2020 న, మెయిన్స్ పరీక్షలను జనవరి 8, 2021 న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ మరో కీలక ప్రకటన చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే సివిల్స్‌ ప్రిలిమ్స్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్)‌ ప్రిలిమినరీ పరీక్షలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను మార్చుకునే అవకాశం కల్పించాలని యూపీఎస్సీ నిర్ణయించింది.

రెండు దశల్లో అభ్యర్థులు పరీక్షాకేంద్రాలు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. జూలై 7-13 వరకు మరియు జూలై 20-24 వరకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌ https://upsconline.nic.in లో పరీక్ష కేంద్రం మార్పుకోసం నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఏదైనా పరీక్ష కేంద్రం యొక్క కెపాసిటీ పూర్తయితే, ఇక ఆ కేంద్రాన్ని ఇతరులకు కేటాయించే అవకాశం ఉండదన్నారు. ఆ కేంద్రాన్ని పొందలేని మిగిలిన విద్యార్థులు మిగతా వాటినుంచి ఎదో ఒక కేంద్రాన్ని ఎంచుకోవచ్చని ప్రకటించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − eleven =