కరోనా తీవ్రత గరిష్ఠ స్థాయిని దాటింది, ఫిబ్రవరి చివరికి కనీస యాక్టీవ్ కేసులతో నియంత్రణ

Corona can be Controlled by End of Feb, Corona can be Controlled by End of Feb with Minimal Active Cases, Covid-19 could be under control by February, Covid-19 peak over, India can control Covid-19 pandemic by February, India Coronavirus, india coronavirus cases, India Coronavirus Updates, Special Covid Panel, Special Covid Panel Says Corona can be Controlled

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, లాక్ డౌన్ ప్రభావాలు వంటి పలు అంశాలపై అధ్యయనం చేసేందుకు ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ ఎం.విద్యాసాగర్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో కేంద్రప్రభుత్వం స్పెషల్ ‌కోవిడ్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం నాడు ఈ కమిటీ కీలక విషయాలను వెల్లడించింది. దేశంలో కరోనా తీవ్రత గరిష్ఠ స్థాయిని దాటిపోయిందని చెప్పారు. అన్ని కరోనా ప్రోటోకాల్స్ ను అనుసరిస్తే, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల చివరికి కనీస యాక్టీవ్ కేసులతో కరోనా మహమ్మారిని నియంత్రించవచ్చని కమిటీ పేర్కొంది.

అయితే రాబోయే పండుగ మరియు శీతాకాల సమయంలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం కూడా ఉందని, తప్పనిసరిగా అన్ని కరోనా‌ నిబంధనలు కొనసాగిస్తూ అన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు. మార్చి నుంచే లాక్ డౌన్ విధించకపోయి ఉంటే జూన్ నెల నాటికే 1.40 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యేవని పేర్కొన్నారు. అలాగే లాక్ డౌన్ లేకుంటే దేశంలో గత ఆగస్టు నాటికే కరోనా మృతుల సంఖ్య 26 లక్షలు దాటిపోయి ఉండేదని కమిటీ అభిప్రాయపడింది. పరిస్థితి తీవ్రంగా ఉంటే తప్ప జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలో కొత్తగా లాక్ డౌన్ లు విధించకూడదని కమిటీ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =