ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు షాక్.. జీవిత ఖైదు విధించిన గాంధీనగర్‌ సెషన్స్‌ కోర్టు

Spiritual Guru Asaram Bapu Sentenced For Life Imprisonment in 2013 Molested Case by Gandhinagar Sessions Court,Gandhinagar Sessions Court,Sentenced Famous Spiritual Guru,Asaram Bapu To Life Imprisonment,Mango News,Mango News Telugu,Asaram Bapu News Today,Asaram Bapu Net Worth,Asaram Bapu Company,Asaram Bapu Age,Asaram Bapu Story,Asaram Bapu News,Asaram Bapu Latest News,Asaram Bapu Satsang,Asaram Bapu Ashram,Asaram Bapu Products,Asaram Bapu Wife,Is Asaram Bapu Alive

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు గాంధీనగర్‌ సెషన్స్‌ కోర్టు షాక్ ఇచ్చింది. 2013లో రాజస్థాన్‌లోని తన ఆశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన తర్వాత ఆయనకు గాంధీనగర్‌లోని సెషన్స్‌ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. కాగా ప్రస్తుతం ఆయన ఇదే కేసులో జోధ్‌పూర్ జైలులో ఉన్నాడు. సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డికె సోనీ వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌కు చెందిన ఓ మహిళా శిష్యురాలు 2001 నుంచి 2006 వరకు అహ్మదాబాద్ సమీపంలోని మోటేరాలోని అతని ఆశ్రమంలో అనేక సందర్భాల్లో తనపై అత్యాచారం చేశారని ఆరోపించింది. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం.. 376 2 (సి) (అత్యాచారం), 377 (అసహజ నేరాలు), 342 (తప్పుగా నిర్బంధించడం), 354 (ఆమె నమ్రతకు భంగం కలిగించే ఉద్దేశంతో దాడి చేయడం లేదా నేరపూరిత బలవంతం చేయడం), 357 (దాడి), మరియు 506 (క్రిమినల్ బెదిరింపు) వంటి పలు సెక్షన్ల కింద ఆశారాంపై చాంద్‌ఖేడా ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు సోమవారం ఆశారాంను దోషిగా నిర్ధారించింది. కాగా సెషన్ కోర్టు ఆదేశాలను గుజరాత్ హైకోర్టులో సవాలు చేయనున్నట్లు ఆశారాం తరపు న్యాయవాది తెలిపారు.

అయితే ఇదే కేసులో సాక్ష్యాలు లేకపోవడంతో ఆశారాం భార్య లక్ష్మీబెన్, వారి కుమార్తె, నేరానికి సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నలుగురు శిష్యులతో సహా మొత్తం మరో ఆరుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిందని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఇక బాధితురాలు క్రిమినల్ బెదిరింపులను ఎదుర్కొన్నారనే వాదనను కూడా కోర్టు అంగీకరించిందని కూడా వెల్లడించింది. అలాగే బాధితురాలి చెల్లెలిపై ఆశారాం కుమారుడు నారాయణ్ సాయి అక్రమంగా నిర్బంధించి అత్యాచారం చేసినట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సాయికి ఏప్రిల్ 2019లో సూరత్‌లోని సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. కాగా ఆశారాంకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఉండటం విశేషం. ఇక ఈ నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =