ప్రధాని మోదీ గొప్ప దార్శనికుడు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

Birthday Wishes to PM Narendra Modi, India PM Narendra Modi’s 71st birthday, janasena chief pawan kalyan, Janasena Chief Pawan Kalyan Extends Birthday Wishes to PM Narendra Modi, Mango News, Narendra Modi Birthday, Narendra Modi Birthday Updates, Pawan Kalyan Extends Birthday Wishes to PM, Pawan Kalyan Extends Birthday Wishes to PM Narendra Modi, PM Modi turns 71, PM Narendra Modi Birthday, PM Narendra Modi Birthday Wishes, PM Narendra Modi Turns 71, Political Leaders and Celebrities Extend Birthday Wishes

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు 71వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. “మన భారతదేశానికి ధృడ చిత్తం కలిగిన నాయకుడు అవసరమని నేను నిత్యం పరితపించేవాడిని. ఆ నాయకుడు మన విశాల భారత సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన రాజనీతిజ్ఞుడై ఉండాలని కోరుకునేవాణ్ణి. ముఖ్యంగా భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన ఒక బిలియన్ ప్రజల భూమిని పాలించడం అంటే కత్తి మీద సాము వంటిదే. ఆ స్థానంలో ఉండటం ఎంతటివారికైనా సవాళ్లతో కూడుకున్నదే. అటువంటి స్థానంలో నిలిచిన నరేంద్ర మోదీ గొప్ప దార్శనికునిగా నేను భావిస్తాను. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా మోదీతో కలసి అనేక సభలలో ప్రచారంలో చేసే అవకాశం నాకు లభించింది. ఆయనలోని ఆకర్షణ శక్తిని సునిశితంగా గమనించడానికి ఆ ప్రయాణం నాకు దోహదపడింది. 71వ జన్మదినం జరుపుకొంటున్న నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలతో కూడిన చిరాయువును ఆ ఆదిపరాశక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =