టీ20 ప్రపంచకప్: పసికూన ఐర్లాండ్ సంచలనం.. వెస్టిండీస్‌కు భారీ షాక్, టోర్నీ నుంచి నిష్క్రమణ

T20 World Cup Ireland Qualify For Super 12 Stage as West Indies knocked Out From The Mega Tourney, T20 World Cup, Ireland Qualify For Super 12 Stage, West Indies knocked Out From Tourney, Mango News, Mango News Telugu, T20 World Cup Ireland Qualified, WI vs IRE T20 World Cup 2022, WI vs IRE T20 World Cup, T20 World Cup West Indies Ireland, West Indies Vs Ireland, Ire vs Wi T20 World Cup Live Score, Ire vs Wi T20 World Cup

టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమైనప్పటినుంచి వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు మరో సంచలనం నమోదైంది. ఈసారి పసికూన ఐర్లాండ్‌ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌కు షాక్ ఇచ్చింది. దీంతో మెగా టోర్నీ నుంచి వెస్టిండీస్‌ వైదొలిగింది. మరోవైపు ఈ విజయం ద్వారా ఐర్లాండ్ సూపర్ 12 దశకు అర్హత సాధించింది. శుక్రవారం హోబర్ట్‌లో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో ఐర్లాండ్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించడం విశేషం. 2012 మరియు 2016లో T20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్.. ఇలా ఒక పసికూన చేతిలో ఓడిపోవడం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ జట్టు 5 వికెట్లకు 146 రన్స్‌ చేయగా.. ఐర్లాండ్ కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విండీస్ జట్టులో బ్రాండన్‌ కింగ్ 62 పరుగులు సాధించగా.. ఐర్లాండ్‌ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ అర్ధ సెంచరీతో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అతడికి టక్కర్‌ 45 రన్స్‌తో అండగా నిలిచాడు. కాగా శ్రీలంక మరియు నెదర్లాండ్స్ జట్లు ఇప్పటికే సూపర్ 12 దశకు అర్హత సాధించగా.. ఇప్పుడు ఐర్లాండ్‌ కూడా ఆ జట్ల సరసన చేరింది. ఇక కెప్టెన్ నికోలస్ పూరన్ నేతృత్వంలోని విండీస్ జట్టు ఆటతీరుపై అభిమానులతోపాటు ఆ జట్టు కోచ్ ఫిల్ సిమన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =